పరేశ్ రావల్ నటించిన ది తాజ్ తెలుగు విడుదల – ఓటీటీలో స్ట్రీమింగ్ వివరాలు

పరేశ్ రావల్ నటించిన ది తాజ్ తెలుగు విడుదల

పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ది తాజ్ సినిమా ఇప్పటికే ఓటీటీ రిలీజ్ అయ్యింది. మొదట ఈ చిత్రం కేవలం హిందీలో మాత్రమే విడుదలైంది, కానీ ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ది తాజ్ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమా తాజ్ మహల్‌ను నిజంగా షా జహాన్ నిర్మించాడా లేదా అనే అంశంపై చర్చిస్తుంది మరియు ఈ చిత్రంలో పరేశ్ రావల్ తన నటనతో అద్భుతంగా మెప్పించాడు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది తుషార్ అమ్రిష్ గోయెల్, సత్యజిత్ హజార్నిస్ ఛాయాగ్రహణం వహించగా, రోహిత్ శర్మ మరియు రాహుల్ దేవ్ నాథ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని సి.ఏ. సురేష్ ఝా నిర్మించారు.

నిజ జీవితసంఘటనల ఆధారంగా వచ్చే సినిమాలు మీకు నచ్చితే, ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు