
గెటప్ శ్రీను ఈ మధ్య కాలంలో ‘మెము కాప్లం’ అనే కామెడీ సిరీస్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ZEE5 అధికారికంగా ప్రకటించింది.
‘మెము కాప్లం’ 2026 మే 22 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో గెటప్ శ్రీనుతో పాటు నాగబాబు, రీతూ చౌదరి, కిరీటి దామరాజు, రవితేజ నన్నిమాల, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సిరీస్‌కు కథను శోభన్ చిట్టుప్రోలు మరియు ప్రదీప్ మద్దాలి అందించగా, దర్శకత్వ బాధ్యతలను కూడా ప్రదీప్ మద్దాలి నిర్వహించారు. సంగీతాన్ని సాకేత్ కోమండూరి సమకూర్చగా, సినిమాటోగ్రఫీని కిషోర్ బోయిదాపు నిర్వహించారు.బి వి ఎస్ రవి మరియు కౌముది కె. నేమాని ఈ సిరీస్‌ను రా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.
