ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెద్ద పోటీ జరుగుతోంది. OpenAI మరియు గూగుల్ రెండు కంపెనీలు కూడా ఎవరు ముందుండాలి అనే రేస్‌లో వేగంగా పరుగులు పెడుతున్నాయి. తాజాగా గూగుల్ AI సిస్టమ్స్ మరియు జెమినీ మోడల్ అభివృద్ధిని వేగంగా పెంచడంతో, OpenAI కంపెనీ ‘కోడ్ రెడ్’ ప్రకటించింది.

‘కోడ్ రెడ్’ అంటే కంపెనీ అత్యవసర స్థితి. అంటే, అన్నీ టీంలు ఒకే లక్ష్యంపై ఫోకస్ కావాలి: గూగుల్ కంటే మంచి AI టెక్నాలజీ త్వరగా తయారు చేయాలి.
OpenAI లోపల ఈ నిర్ణయంతో చాలా ప్రాజెక్ట్‌లను ఆపి, ముఖ్యంగా ChatGPT & కొత్త AI మోడల్స్ అప్గ్రేడ్ పై టీంలు పని చేయడం మొదలుపెట్టాయి.
గూగుల్ జెమినీ మోడల్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన AI. గూగుల్ కి ఇప్పటికే యూట్యూబ్, సెర్చ్, ఆండ్రాయిడ్ వంటి భారీ యూజర్ బేస్ ఉంది, కొత్త AI టూల్‌లతో గూగుల్ మార్కెట్‌ను తనవైపుకు తిప్పుకోవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో OpenAI తమ పోజిషన్ కోల్పోకుండా ఉండటానికి ఫాస్ట్ డెవలప్‌మెంట్ స్ట్రాటజీ ప్రారంభించింది.
ChatGPT మరింత అడ్వాన్స్‌డ్ వెర్షన్ తీసుకురావడం, AI డేటా వేగం, ప్రెసిషన్, సేఫ్టీ పెంచడం, AI అసిస్టెంట్‌ను రియల్ టైమ్‌లో ఉపయోగించుకునేలా తయారు చేయడం, బిజినెస్ & కంపెనీల కోసం స్పెషల్ AI టూల్స్ తయారు చేయటం పై దృష్టి పెడుతోంది.
OpenAI CEO సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ,“AI రేస్‌లో ముందుండటం చాలా ముఖ్యం. యూజర్ల నమ్మకం మరియు క్వాలిటీ మా మొదటి ప్రాధాన్యం” అన్నారు.
OpenAI, గూగుల్ పోటీని సీరియస్‌గా తీసుకుని Code Red మోడ్‌లోకి వెళ్లింది. తదుపరి కొన్ని నెలలలో AI టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చే పెద్ద అప్‌డేట్‌లు రావచ్చు. ప్రస్తుతానికి AI యుద్ధం మొదలైంది, మరి ఇందులో గెలిచేది ఎవరో చూడాలి.
