భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన ప్రస్తుతం తన వివాహ ఏర్పాట్లతో పాటు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది. వివాహానికి ముందు ఆమె ఫియాన్సే, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది.

స్మ్రితి మందాన పేరు తెలిసేలా, అలాగే స్మ్రితి జెర్సీ నెంబర్ అయిన 18 కూడా వచ్చేలా పలాష్ తన చేతిపై ఒక టాట్టూ వేయించుకున్నాడు, అది చుసిన క్రికెట్ అభిమానులు అందరూ వాళ్ళ ప్రేమ గురించి మెచ్చుకుంటున్నారు.
రిపోర్ట్స్ ప్రకారం, పలాష్ ముచ్చల్ స్మృతి మంధానకు ఒక లగ్జరీ కస్టమ్ డిజైన్ కార్‌తో పాటు ఆమె కోసం ప్రత్యేకంగా స్వయంగా రాసిన ఒక పాటను బహుమతిగా ఇచ్చాడు. ఈ గిఫ్ట్ చూసి స్మృతి ఎమోషనల్ అయ్యిందని, సోషల్ మీడియాలో అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.
స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ వివాహం ఈ ఏడాది చివర్లో జరగనున్నట్లు సమాచారం.
ముంబై, ఇండోర్‌లో ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు జరగనున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు క్రికెట్ ఫ్రాటర్నిటీకి చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఇద్దరూ ఏడాది కిందట ప్రేమలో పడ్డారు, ఈ సంవత్సరం ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
పలాష్ ముచ్చల్ ఇచ్చిన ఈ ప్రీ-వెడ్డింగ్ గిఫ్ట్ స్మృతి మంధాన అభిమానుల హృదయాలను గెలుచుకుంది. వారి ప్రేమకథ, మధురమైన గిఫ్ట్, మరియు సోషల్ మీడియాలోని రియాక్షన్స్ ఈ జంటను మళ్లీ ట్రెండ్‌లోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నది – ఈ స్టార్ కపుల్ గ్రాండ్ వెడ్డింగ్ కోసం!
