IND vs South Africa రెండో ODI మ్యాచ్ రాయిపూర్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మరోసారి టాస్ ఓడింది. ఇది వరుసగా 20వ ODI టాస్ ఓటమి. ఈ ఫలితంతో భారత జట్టు కెప్టెన్ KL రాహుల్ కూడా చాలా నిరాశగా కనిపించాడు.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. టాస్ ఓటమి తర్వాత KL రాహుల్ మాట్లాడుతూ, “ఇంకోసారి టాస్ కోల్పోవడం బాధగా ఉంది. మేము గెలిచేద్దామనుకున్నాం, కానీ అదృష్టం మాతో లేదు” అని చెప్పాడు.
భారత్ వరుసగా 20 ODI మ్యాచ్‌ల్లో భారత్ టాస్ గెలవలేదు, ఇది క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్.
అభిమానులు సోషల్ మీడియాలో టాస్ అదృష్టం గురించి మీమ్స్, కామెంట్లు చేస్తున్నారు. కొన్నిమ్యాచ్‌ల్లో టాస్ ఓటమి ఫలితాన్ని కూడా ప్రభావితం చేసింది.
టాస్ గెలిస్తే జట్టు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకోవచ్చు, పిచ్ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు చాలాసార్లు మ్యాచ్‌పై పెద్ద ప్రభావం చూపుతాయి. వరుసగా టాస్ ఓడిపోతే జట్టుకు మానసిక ఒత్తిడి కూడా ఏర్పడుతుంది.
సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా, కోపంతో ఇలా కామెంట్ చేస్తున్నారు “టాస్ కోసం స్పెషల్ కోచ్ పెట్టాలి ఏమో!” “20 టాస్ వరుస ఓటమి – ఇది అదృష్టమా లేక శాపమా?”
రాయిపూర్ ODIతో భారత్ 20వసారి టాస్ ఓడిన రికార్డు సాధించింది. KL రాహుల్ నిరాశగా ఉన్నా, జట్టు ఆటతో ఈ అదృష్టాన్ని మార్చాలని చూస్తోంది.
