Na Peru Shiva 2 Review: నా పేరు శివ 2 మూవీ రివ్యూ

Na Peru Shiva 2 Review: కాథరీన్ త్రెస, కార్తీ, కలయరసన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా నా పేరు శివ 2 ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ 2014లో తమిళ లో రిలీజ్ అయిన మద్రాస్ కు తెలుగు డబ్. తమిళ లో హిట్ టాక్ వచ్చనట్లే తెలుగులో కూడా దీనికి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Na Peru Shiva 2 Review

తారాగణం, కథ

నా పేరు శివ 2 మూవీలో కాథరీన్ త్రెసా, కార్తి, కలయరసన్ ప్రధాన పాత్రలో నటించారు. కె.ఈ జ్క్షానవెల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. పా రంజిత్ ఈ మూవీకి కథ రాయడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయన్ సంగీతాన్ని సమకూరిస్తే, జి. మురలి సినిమాటోగ్రఫీ బాధ్యతలను స్వీకరించారు.

ఇక ఈ సినిమా కథలో.. కార్తీ, కళయరసన్ ఇద్దరూ ప్రాణ మిత్రలు. ఒకరికోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే టైప్. కార్తీ కాథరీన్ ను ప్రేమిస్తాడు. అయితే వీళ్లంతా గవర్నమెంట్ కు సంబంధించిన ఓ కాలనీలో ఉంటారు. అక్కడ ఉన్న ఓ గోడ చుట్టే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆ గోడపై పోస్టర్లు ఎవరంటించాలనే దానిపై రాజకీయ గ్రూపు గొడవలు జరుగుతాయి. ఈ గొడవల్లో కార్తి ఫ్రెండ్ కళయరసన్ ను దారుణంగా చంపేస్తారు. అంతిమంగా కార్తీ తన మిత్రుడు హత్యకు ఎలా పగ తీర్చుకుంటాడనేదే స్టోరీ.

సినిమా ఎలా ఉందంటే

నా పేరు శివ 2 కథ చాలా కొత్తగా ఉంది. రాజకీయాల వెనుక ఎన్ని కుతంత్రాలు జరుగుతాయో రచయిత దర్శకుడు పా. రంజిత్ అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తం కుటుంబం కలిసి ఒకసారి చూడతగ్గ సినిమా. మ్యూజిక్ కూడా అద్భతంగా కంపోజ్ చేశారు.

మూవీ రేటింగ్: 3.5/5

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు