
‘MAA’ తో చర్చలు జరిపిన ‘TUOWJ’ డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు… సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నTUOWJ నిన్న (17.1.2022) ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు, ట్రెజరర్ శివ బాలాజీ గారిని కలవడం జరిగింది. డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ”తప్పుడు Thumbnails పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో… కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మంచు విష్ణు TUOWJ సభ్యులకు స్ఫష్టంగా తెలియజేసారు.
