Surabhi 70MM Movie Review: సురభి70ఎంఎం మూవీ రివ్యూ

Surabhi70MM Movie Review: సురభి 70MM ఛిత్రంలో అక్షిత శ్రీనివాస్, వినోద్ కుమార్, అనిల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒమిక్రాన్ వల్ల ఈ సినిమా రిలీజ్ కు మొన్నటి వరకు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 18, 2022న ఎన్నో తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో సురభి 70ఎమ్‌ఎమ్ ఒకటి, ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా సరైన ఓపెనింగ్‌ను తీసుకోలేదు, ఈ సినిమా గురించి చాలా మందికి తెలియదు కానీ సినిమా చూసిన వారు కథ గురించి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలా నచ్చిందో చూద్దాం.

Surabhi70MM Movie Review

కథ

కథ మొత్తం తెలంగాణ మంచిర్యాల జిల్లా, అక్కడు ఉన్న సురభి 70ఎంఎం సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతుంది. నారాయణ రావు ఈ థియేటరుకు ఓనర్. ఆ థియేటర్ తో అతనికి చాలా అనుబంధం ఉంటుంది. కానీ అక్కడ ఉన్న గూండాలు దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. అయితే నారాయణ రావుకు తోడుగా తన 5గురు స్నేహితులు ఉంటారు. వారంతా కలిసి ఆ గూండాలను ఎదుర్కొంటారు. ఆ ఐదుగురు ఎవరు.. వారితో థియేటర్కు ఎలా సంబంధం తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

సురభి70MM సినిమా నటీనటులు, సిబ్బంది

అక్షిత శ్రీనివాస్, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. గాంగాధర్ అద్వైత దర్శకత్వం వహించారు. కెకె చైతన్య దీనిని నిర్మించారు. డెన్నిస్ నోటర్న్ సంగీతాన్ని సమకూర్చగా శేఖర్, భరత్ సి కుమార్, గోపాల్ ఎస్ఎస్వి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

సినిమా పేరుసురభి 70ఎంఎం
నటీనటులుఅక్షిత శ్రీనివాస్, వినోద్ కుమార్, అనిల్ కుమార్
దర్శకులుగంగాధర అద్వైత
నిర్మాతకెకె చైతన్య
సంగీతండెన్నిస్ నోర్టన్
సినిమాటోగ్రఫీశేఖర్, భరత్ సి కుమార్, గోపాల్ ఎస్ఎస్వి

 

సినిమా తీర్పు

సురభి 70MM సినిమా భావోద్వేగ సన్నివేశాలతో ఆసక్తికరంగా మొదలవుతుంది, తర్వాత అది సాగదీసిన సన్నివేశాలతో కొంచెం బోరింగ్‌గా అనిపించింది, ఐదుగురు స్నేహితులు రంగంలోకి దిగిన తర్వాత సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఓవరాల్‌గా సురభి 70ఎమ్ఎమ్ ఎమోషనల్ డ్రామా, కొన్ని లాజిక్‌లను పక్కన పెడితే చూడటానికి బాగుంటుంది.

సినిమా రేటింగ్: 3/5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు