Good Luck Sakhi Movie Review: గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ

Good Luck Sakhi Movie Review: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గుడ్ లక్ సఖి ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగుతో పాటి తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి టాక్ వినిపిస్తుంది. ఎన్నో పాత్రల్లో మనల్ని అలరించిన కీర్తి సురేష్.. ఈ సినిమాలో తెలంగాణ ఊరి ఆడపిల్లగా అద్భుతంగా నటించింది.

గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ (Good Luck Sakhi Movie Review)

Good Luck Sakhi Movie Review: గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ

సినిమా కథ విషయానికి వస్తే.. తనని అందరూ దురదృష్టాంగా భావించే సఖి ఎలా ఊరికి మంచిపేరు తీసుకువస్తుందోననే కాన్సెప్ట్ తో డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. జగపతి బాబు ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా ఈ కథకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. కోచ్ పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయారు.

తెలంగాణ గ్రామం లోని సఖి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. దాదాపు అన్ని సీన్లని తెలంగాణ జిల్లా వికారాబాద్ లోనే షూట్ చేశారు. తెలుగులోనే కాకుండా, తమిళ్, మలయాళంలో కూడా ఈ సినిమాకి మంచి టాక్ వినిపిస్తుంది. మొదటి వారమే ఈ సినిమా 20 కోట్లు కలెక్షన్ చేస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

ప్లస్ పాయింట్స్ 

విలేజ్ బ్యాగ్ డ్రాప్ స్టోరీ కావడంతో ఇంట్రెస్ట్ పెంచింది. కీర్తి సురేష్ నటన ఎక్కడా బోర్ కొట్టించదు. కథ సాఫీగా క్లీయర్ గా సాగుతుంది. కీర్తి సురేష్ మాత్రమే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్

డబ్బింగ్ సరిగ్గా జరపలేదు. హడావుడిలో స్పీడ్ గా డబ్బింగ్ చేశారు. స్ర్కిప్ట్ రైటింగ్ లో ఇంప్రూవ్ చేయాల్సి ఉన్నది. స్పోర్ట్ సీన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కు తగినట్టు తీయలేదు. ఎడిటింగ్ కూడా మరింత బాగా చేసి ఉండాల్సింది.

సినిమా ఎలా ఉందంటే?

ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా చిత్రం అని చెప్పుకోవచ్చు. కామెడీ ఉన్నా స్ర్కీన్ ప్లే కారణంగా కొంత దెబ్బ తిన్నది. ఏ కారణం లేకుండా కొన్ని సీన్లు సాగిపోతూ ఉంటాయి. స్పోర్ట్స్ డ్రామా మూవీల్లో ఉండాల్సిన కిక్ ఇందులో లేదు. సినిమాను మరింత బాగా ప్రెజెంట్ చేస్తే బాగుండేది.

మూవీ రేటింగ్: 2.5/5 (ఆవరేజ్)

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు