The Legend (2022) Telugu Movie Review: ది లెజెండ్ తెలుగు మూవీ రివ్యూ

The Legend Telugu Movie Review: తమిళనాడులో “ది లెజెండ్ శరవణన్” స్టోర్స్‌తో చాలా ఫేమస్ అయిన వ్యాపారవేత్త శరవణన్, “ది లెజెండ్” చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ చిత్రం పలు భాషలలో విడుదలైంది మరియు ప్రాజెక్ట్‌లో చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులతో భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్‌కు పలువురు అగ్ర కథానాయికలు హాజరుకావడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా యొక్క లోతైన సమీక్షలోకి వెళ్లి, ఈ చిత్రం చూడదగినదో కాదో తెలుసుకుందాం.

The Legend Telugu Movie Review

కథ

డా. శరవణన్ ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త, అయినప్పటికీ తన గ్రామంలోని పేదలకు సహాయం చేసే మంచి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటాడు మరియు తన ఆవిష్కరణలతో దేశానికి సహాయం చేయాలనుకుంటాడు. అతను తన గ్రామానికి తిరిగి వచ్చి తన కలల కోసం పని చేయడం మొదలుపెడతాడు, కానీ స్థానిక రాజకీయ నాయకులు మరియు VJ అనే లోకల్ రౌడీ నుండి అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు. శరవణన్ ఈ అడ్డంకులన్నీ ఎలా ఎదుర్కొన్నాడు మరియు అతని కలను ఎలా సాకారం చేసుకున్నాడు అనేది మిగిలిన కథ.

ధర్జా మూవీ నటీనటులు

సినీ తారలు లెజెండ్ శరవణన్, ఊర్వశి రౌతేలా, గీతిక ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వివేక్, నాజర్, ప్రభు, విజయకుమార్, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లెజెండ్ శరవణన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి జెడి-జెర్రీ దర్శకత్వం వహించారు. హారిస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చగా, విలియం ఆర్‌.వెల్‌రాజ్‌ కెమరామెన్ గా చేసాడు, ఎడిటింగ్‌ రూబెన్‌కి అప్పగించారు.

సినిమా పేరుది లెజెండ్
దర్శకుడుJD-జెర్రీ
నటీనటులులెజెండ్ శరవణన్, ఊర్వశి రౌతేలా, గీతిక
నిర్మాతలులెజెండ్ శరవణన్
సంగీతంహారిస్‌ జయరాజ్‌
సినిమాటోగ్రఫీఆర్‌.వెల్‌రాజ్‌
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ధర్జా సినిమా ఎలా ఉందంటే?

ఈ సినిమాలోని కథ సూపర్ స్టార్ రజనీకాంత్ పాత సినిమాల మాదిరిగానే ఉంటుంది మరియు ఇది 2007లో విడుదలైన “శివాజీ: ది బాస్”ని మీకు ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. పాత కథతో మరియు అంతే పాత మేకింగ్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది, అయితే సినిమా చాలా పెద్ద స్థాయిలో నిర్మించారు. సినిమా ప్రారంభం నుండే గతంలో వచ్చిన చాలా సినిమాలు గుర్తుచేస్తుంది మరియు సన్నివేశాల్లో కొత్తదనం ఏమీ లేదు. సినిమాల గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు కూడా సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించవచ్చు.

నటుడు శరవణన్ చాలా సన్నివేశాల్లో పూర్తిగా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చాలా సన్నివేశాల్లో ఒక బొమ్మలా కనిపిస్తాడు. చాలా సన్నివేశాల్లో అతని బాడీ డబుల్‌ని మనం స్పష్టంగా చూడవచ్చు. గీతిక పాటల్లో అందంగా కనిపించింది కానీ సినిమాలో పెద్దగా చేసేదేమీ లేదు. ఊర్వశి రౌతేలా పరిమిత పాత్రలో ఓకే. VJ గా నటుడు సుమన్ విలన్‌గా బాగున్నా, అతని లుక్స్ చాలా కృత్రిమంగా ఉన్నాయి. వివేక్ మరియు యోగి బాబు మిమ్మల్ని కొన్ని సార్లు నవ్విస్తారు. మిగతా నటీనటులందరూ తమ వంతు పాత్రను చక్కగా చేశారు.

సాంకేతికంగా సినిమా చాలా గ్రాండ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గలేదు మరియు శరవణన్ సినిమాని అన్ని విధాలుగా గ్రాండ్‌గా చేయడానికి అవసరమైనంత ఖర్చు చేసినట్లు అనిపిస్తుంది. ఆర్.వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది మరియు కొన్ని షాట్‌లు బాగా డిజైన్ చేయబడ్డాయి. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హారిస్ జయరాజ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. JD -జెర్రీ చాలా పాత కథను ఎంచుకుని, ఆకట్టుకోని పాత ట్రీట్‌మెంట్‌తో సినిమా తీశారు.

చివరగా, ది లెజెండ్ సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్, ఇది పేలవమైన మేకింగ్ కారణంగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు.

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు