
మార్వెల్ కు భారతదేశంలో కూడా భారీ అభిమానులు ఉన్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుండి వచ్చిన అనేక పాత్రలు ఇప్పటికీ భారతీయ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. “డేర్ డెవిల్” కూడా అలాంటి పాత్రలలో ఒకటి మరియు వారు “డేర్ డెవిల్: బోర్న్ ఎగైన్” అనే కొత్త సిరీస్ ను ఇప్పుడు మన ముందుకు తీసుకువస్తున్నారు.
డేర్ డెవిల్ సిరీస్ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అయింది ఇక ఇప్పుడు మేకర్స్ డేర్ డెవిల్: బోర్న్ ఎగైన్ అనే కొత్త సిరీస్ ను అందిస్తున్నారు, ఇది మార్చి 05, 2025 న జియో హాట్ స్టార్ OTT ప్లాట్ ఫామ్ లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో రిలీజ్ అవుతుంది.
మార్వెల్ సినిమాలు మరియు సిరీస్ లు ఇటీవలి కాలంలో అంచనాలను అందుకోవడం లేదు మరి ఈ కొత్త సిరీస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) యొక్క వైభవాన్ని తిరిగి తీసుకురాగలదా అని చూద్దాం.
