
మార్వెల్ ఇటీవల నిర్మించిన సూపర్ హీరో చిత్రం ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ OTTలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్, కెప్టెన్ అమెరికా ఫ్రాంచైజీలో నాల్గవ అధ్యాయం అలాగే ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు అద్భుతమైన స్పందనలను పొందింది ప్రేక్షకుల నుండి.
ఇక ఇప్పుడు మిమల్ని అలరించడానికి OTT లోకి వస్తోంది. కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ 28 మే 2025న జియో సినిమాలో ప్రీమియర్ అవుతుంది.
ఈ చిత్రంలో ఆంథోనీ మాకీ, డానీ రామిరేజ్, కార్ల్ లంబ్లీ, హారిసన్ ఫోర్డ్ మరియు ఇతరులు నటించారు. జూలియస్ ఓనా ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు.
క్రామెర్ మోర్గెంటౌ కెమెరాను హ్యాండిల్ చేశారు, లారా కార్ప్‌మాన్ సంగీతం సమకూర్చారు మరియు కెవిన్ ఫీజ్ మరియు నేట్ మూర్ ఈ చిత్రాన్ని మార్వెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో నిర్మించారు.