రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే చిత్రం, ది రాజాసాబ్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. ప్రభాస్ ని చాలా కాలంగా అభిమానులు ఎప్పుడు చూడనంత హైపర్ ఆక్టివ్, ఎనర్జిటిక్ పాత్రలో కనిపించడం చాలా ఆసక్తికరంగా ఉంది.
దర్శకుడు మారుతి, చిత్ర బృందంతో కలిసి, ప్రభాస్ తన అభిమానులను మరియు ప్రేక్షకులను వినోదాత్మక ప్రదర్శనతో ఆశ్చర్యపరచబోతున్నారని వెల్లడించారు.
ది రాజాసాబ్ డిసెంబర్ 05, 2025న థియేటర్లలోకి రానుంది, విడుదల తేదీని అధికారికంగా కొత్త పోస్టర్‌తో పాటు ప్రకటించారు.
ప్రభాస్ పోస్టర్‌లో అయితే అద్భుతంగా కనిపిస్తున్నాడు, అభిమానులను చాల ఆశ్చర్యపరచింది. సినిమా గురించి ఉన్న సందడి రెండు రెట్లు పెరిగింది, ప్రేక్షకులు తెరపై ప్రభాస్ హాస్య పాత్రలో తిరిగి రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.