సన్నీ డియోల్ నటించిన “జాట్” సినిమా OTT లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిందీలో మాత్రమే విడుదలైంది, కానీ OTT లో తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది.
సన్నీ డియోల్ యాక్షన్ కి పెట్టింది పేరు, ఈ సినిమాలో అతని యాక్షన్ కి ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. ఇక ఓటీటీలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
జాట్ సినిమా జూన్ 05, 2025న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుంది. సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్రా, సయామి ఖేర్, స్వరూప ఘోష్ మరియు ఇతరులు నటించారు.
కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: గోపీచంద్ మలినేని, కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: థమన్ ఎస్, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మరియు TG విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.