ఇటీవలి మల్టీ స్టారర్ చిత్రం భైరవం OTT లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. భైరవం కొంత అంచనాలతో థియేటర్లలో విడుదలైంది, దురదృష్టవశాత్తు, అది బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు.
భైరవం చిత్రం 18 జూలై 2025న Zee5లో విడుదల అవుతుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు, జయసుధ, అదితి శంకర్, ఆనంది దివ్య పిళ్లై, అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహితాశ్వ, సంపత్ రాజ్, సందీప్ రాజ్, మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు కాగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకుర్చారు. హరి కె వేదాంతం కెమెరా హ్యాండిల్ చేయగా, PEN స్టూడియోస్ బ్యానర్‌పై KK రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.