ఇటీవలి తెలుగు సినిమా “కొత్తపల్లిలో ఒకప్పుడు” జూలై 18, 2025న థియేటర్ లలో విడుదలైంది. ఇక ఇప్పుడు, థియేటర్ లో విడుదలైన 30 రోజుల తర్వాత OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
“కొత్తపల్లిలో ఒకప్పుడు” ఆగస్టు 22, 2025న ఆహా వీడియోలో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్ సాగర్ మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీతం సమకూర్చగా, వరుణ్ ఉన్ని నేపథ్య సంగీతం అందించారు.
పెట్రోస్ ఆంటోనియాడిస్ కెమెరా హ్యాండిల్ చేయగా, గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి చిత్రాన్ని నిర్మించారు మరియు రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని అందించారు.