
త్రిల్లర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది దర్శకుడు జీతు జోసెఫ్, మల్లి మిరేజ్ అనే థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ప్రేక్షకుల మరియు విమర్శకుల నుంచి మంచి స్పందన పొందింది. ఇక సినిమాలో అసీఫ్ అలీ ప్రధాన పాత్రలో కనిపించారు,
ఇప్పుడు ఈ సినిమా OTTలోకి రాబోతుంది. మిరేజ్ 20 అక్టోబర్ 2025 నుండి SonyLIVలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలి భాషల్లో విడుదల కాబోతుంది.
సినిమాను జీతు జోసెఫ్ దర్శకత్వం వహించగా, ముకేష్ ఆర్. మేహ్తా, సి.వి. సరాథి, జతిన్ ఎం. సేతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ కురూప్ ఛాయాగ్రహణం అందించగా, సంగీతాన్ని విష్ణు ష్యామ్ అందించారు.
