
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా K-Ramp అక్టోబర్ 17, 2025న థియేటర్స్‌లో విడుదల కానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో, తన సినిమాలను ప్రేక్షకులు జాలి పది చూడొద్దు అని చెప్పారు. నేను నా సినిమాని దయచేసి చుడండి అని అడగడానికి సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు, సినిమా ఇష్టమైతే చూడండి,” అని కిరణ్ తెలిపారు.
కిరణ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా మాట్లాడుతూ, తన మొదటి సినిమా నుంచే చాలా నెగటివ్ వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని. అలాగే, ఆయన గత చిత్రం KA తెలుగులో ఆశించిన సంఖ్యలో స్క్రీన్లు పొందలేదని, కానీ ఇప్పుడు తన సినిమా K-రాంప్ తో పాటు విడుదలవుతున్న Dude డబ్బింగ్ వెర్షన్ సినిమాకి మంచి స్క్రీన్లు దొరికాయని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ Dude నిర్మాత, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇవ్వండి, దాన్ని ప్రేక్షకులు ఇష్టపడితే స్క్రీన్లు స్వయంగా పెరుగుతాయి. అవసరంలేని వ్యాఖ్యలు చేయవద్దు,” అని అన్నారు.
వివాదాల మధ్య, ఇప్పుడు K-Ramp థియేటర్లలో ఎలా ఆడుతుందో చూడాలి.
