విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘శక్తి తిరుమగన్’ తెలుగులో భద్రకాళి టైటిల్ తో థియేటర్లలో మంచి రిస్పాన్స్ తెచ్చుకున్న తర్వాత, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, భద్రకాళి సినిమా JioHotstarలో అక్టోబర్ 24, 2025 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేట్రికల్ రిలీజ్‌కి ఐదు వారాల తర్వాతే OTTలోకి వస్తుండటం అభిమానుల్లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది.
తమిళ ఒరిజినల్ ‘శక్తి తిరుమగన్’ సెప్టెంబర్ 19, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్, ఇందులో విజయ్ ఆంటోనీ పవర్, పాలిటిక్స్, లంచం మధ్య నడిచే కథలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రని పోషించారు.
సినిమాకు దర్శకత్వం వహించింది “అరువి” సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ ప్రభు పురుషోత్తమన్. విజయ్ ఆంటోనీనే ఈ సినిమాకి నిర్మాత. సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని తెలుగు లో రిలీజ్ చేసారు.
విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రిని, రియా జీతూ మరియు మాస్టర్ కేశవ్ ముఖ్య పాత్రలు పోషించారు.