సినిమా: తెలుసు కదా
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు
దర్శకుడు-రచయిత: నీరజా కోన
సంగీతం: థమన్ S
కథ:
తెలుసు కదా ఒక ప్రేమ-ట్రయాంగిల్ కథగా మొదలవుతుంది, కానీ ఇది ప్రేమ మాత్రమే కాదు, సంబంధాలు, బాధ్యతలు, తన స్వాభిమానం (self-respect) వంటి అంశాలను కూడా ప్రేరేపిస్తుంది. వరుణ్ అనే యువకుడు, అంజలి ని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టారని తెలిసి రాగ అనే డాక్టర్ ని సరోగసీ కి సాయం అడుగుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలే మిగతా కథ.
సిద్ధు జొన్నలగడ్డ ప్రేమలో పడిపోయిన యువకుడిగా, అనుమానాల మధ్య, వ్యక్తిగత భావోద్వేగాలలో చాలా బాగానే నటించాడు. రాశీ ఖన్నా కూడా ఉన్నంతలో మంచి హావభావాలతో మెప్పించింది. శ్రీనిధి శెట్టి భావోద్వేగం, సంక్షోభాలు మధ్యలో నలిగిపోయే పాత్రలో మెప్పించింది.
నీరజా కోన మొదటి సినిమా అయినా, ప్రేమ సంబంధాల లోతైన భావాలను, జెన్-జి (Gen Z) ప్రేక్షకులకు చేరేలా తెరకెక్కించడానికి ప్రయత్నించారు. కొన్ని సీన్లు ఎక్కువ డ్రామాటిక్‌గా అనిపించవచ్చు, కానీ మొత్తం చూసినప్పుడు కొత్త రకం ప్రేమ కథగా చూస్తే, అది Refreshing గా ఉంది.
థమన్ యొక్క పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి రెజొనెన్స్ అందిస్తున్నాయి — కొన్ని పాటలు ఇప్పటికే జనాల్లోకి ఎల్లిపోయి సినిమా కి మంచి బజ్ తీసుకుకొచ్చాయి.
సినిమాటోగ్రఫీ కూడా bagundhi, అనేక సందర్భాల్లో స్లో-మోషన్ shots, దృశ్య ప్రకటనలు (visual stylings) కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కథలో లోతు తెలిసేలా ఉన్నాయి.
ప్రేమ కొత్త కోణంలో చూపించడం ఈ సినిమాకి పాజిటివ్ గా మాయింది, సిద్ధూ పాత్రా రూపకల్పన కూడా పేక్షకులని ఆకట్టుకుంటుంది. అయితే రెండవ సగం లో కథనం నెమ్మదిస్తుంది, కథ ఎంతకీ ముందుకు వెళ్ళదు.
తెలుసు కదా ఒక ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామా. ఇది ప్రేమ, బాధ్యత, స్వాభిమానం మధ్య సమతుల్యత ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తుంది. ఈ సినిమా ముఖ్యంగా యువ ప్రేక్షకులు, ప్రేమ-కథలు ఇష్టపడేవారికి, కచ్చితంగా నచ్చుతుంది.