ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ – హను రాఘవపూడి చిత్రం “Fauzi” ఫస్ట్-లుక్ పోస్టర్ రిలీజ్

ప్రభాస్–హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం “Fauzi”కి సంబంధించి, ప్రభాస్స్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు.

Prabhas Birthday Surprise

ఈ పోస్టర్ ద్వారా సినిమాకు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించారు .

పోస్టర్‌లో ప్రభాస్ ఒక సీరియస్ లుక్ లో ఒక యోధుడిలా కనిపిస్తున్నారు — ముఖంలోని కోపం, అలాగే ఒక్క సైడులో బర్నింగ్ బ్రిటీష్ జెండా స్పష్టంగా కనిపిస్తోంది.

పోస్టర్‌లో కనిపించే ట్యాగ్‌లైన్: “A battalion who fights alone” — స్వతంత్రం కోసం పోరాడే ఒక యోధుడి కథ అని సూచిస్తోంది. పోస్టర్‌లో సంస్కృత శ్లోకాలు కూడా ఉన్నాయి.

“పద్మవ్యూహ విజేతః పార్థః … గురువిరహితః ఏక‌ల‌వ్యః జన్మనేవ యోద్ధా ఏషః॥”
ఈ శ్లోకాలు దేవా­యుధులు, యోధులు వంటి పురాతన సందర్బాలను రిఫ్రెష్ చేస్తున్నట్టు కనిపిస్తాయి.

ఇది స్వాతంత్ర్య కాలం లో 1940ల భారతదేశం లో జరిగిన కొన్ని సంఘటనల సమాహారంగా ఉంటుంది అని స్పష్టం అవుతుంది.

ప్రభాస్ పుట్టినరోజు వేదికగా ఈ అనౌన్స్‌మెంట్ రావటం అభిమానులకు అందరికి ఆనందాన్ని కలిగించింది. సినిమాపై ఉన్న అంచనాలు ఇంకా పెరిగాయని భావిస్తున్నారు.

హను రాఘవపూడి గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘సీత రామం’ తర్వాత మరో స్థాయిలో ఉండబోతుంది ఈ సినిమా అని అనుకుంటున్నారు.

ప్రేక్షకులు ఇప్పటికే పోస్టర్‌లోని వివరాలను డికోడ్ చేస్తున్నారు — యుద్ధ కాలం, మైథాలజీ సూచనలు అన్ని కలిపి వాళ్ళకి అనిపించినా కథలు కూడా ఆల్లుతున్నారు.

విడుదల తేదీ మీద ఊహాగానాలు ఉన్నా, మేకర్స్ స్పష్టంగా ఇంకా ఏ తేదీ వెల్లడించలేదు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు