కళ్యాణ్ రామ్, విజయశాంతి జంటగా నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.
ఇక ఇప్పుడు, ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా, ప్రైమ్ వీడియో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమాను విడుదల చేసింది. మీరు ఈ సినిమా చూడాలనుకుంటే, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి.
కళ్యాణ్ రామ్, విజయశాంతిలతో పాటు, ఈ సినిమాలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు, అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చారు, రామ్ ప్రసాద్ కెమెరా హ్యాండిల్ చేసారు మరియు అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మించారు.