ఇటీవల విడుదలైన మోహన్ లాల్ తుడరుమ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం కేరళలో మాత్రమే 100 కోట్లు వసూలు చేసింది.
కేరళలో ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చిన తర్వాత ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. అయితే, తెలుగు వెర్షన్ కూడా బాగానే ఆడింది.
ఇప్పుడు, తుడరుమ్ OTT లో విడుదల తేదీ రిలీజ్ చేసింది. తుడరుమ్ మే 30, 2025న జియోహాట్‌స్టార్‌లో ప్రసారానికి సిద్ధంగా ఉంది. మోహన్ లాల్ తో పాటు, ఈ చిత్రంలో శోభనా, ప్రకాష్ వర్మ, థామస్ మాథ్యూ, అమృత వర్షిణి, ఫర్హాన్ ఫాసిల్, మణియన్‌పిల్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు, షాజీ కుమార్ కెమెరా హ్యాండిల్ చేసారు, జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు మరియు దీనిని రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం. రెంజిత్ నిర్మించారు.