ధనుష్ మరియు నాగార్జున నటించిన కుబేరా చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని వసూలు చేసింది.
థియేటర్ల లో విజయవంతంగా నడిచిన తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు OTTలో విడుదలకు సిద్ధంగా ఉంది. కుబేరా చిత్రం జూలై 18, 2025న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.
కుబేరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. ధనుష్ మరియు నాగార్జునతో పాటు, ఈ చిత్రంలో రష్మిక మందన్న మరియు జిమ్ సర్భ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు, నికేత్ బొమ్మి కెమెరా బాధ్యతలు నిర్వర్తించాడు మరియు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.