ప్రతిభావంతుడైన నటుడు నరేష్ ఆగస్త్య ప్రధాన పాత్రలో నటించిన “మేఘాలు చెప్పిన ప్రేమకథ” ఇప్పుడు డిజిటల్ స్పేస్‌కి రానుంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 30 రోజులకే ఓటీటీలో ప్రేక్షకులను పలకరించబోతోంది.
మేఘాలు చెప్పిన ప్రేమకథ సెప్టెంబర్ 26, 2025 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది. నరేష్ ఆగస్త్యతో పాటు రాబియా ఖతూన్, రాధికా శరత్‌కుమార్, ప్రిన్స్ రామ వర్మ, సుమన్, ఆమని, తులసి, తనికెళ్ళ భరణి, వెంకటేశ్ కాకుమాను, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి విపిన్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరించగా, మోహనకృష్ణ ఛాయాగ్రహణాన్ని అందించారు. సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ సమకూర్చగా, ఉమా దేవి కోట నిర్మాణ బాధ్యతలు సునేత్రా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్వహించారు.