అనుష్క శెట్టి నటించిన ఘాటి సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఇప్పుడు విడుదలైన 20 రోజుల తరువాత, ఈ చిత్రం ఓటిటి లోకి రాబోతుంది. ఘాటి ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 26, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అనుష్క శెట్టి సరసన విక్రమ్ ప్రభు, చైతన్య రావు మాదడి, జగపతి బాబు, జిష్షు సేంగుప్తా, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి కటాసాని సినిమాటోగ్రఫీ అందించగా, సాగర్ నాగవెల్లి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.