ప్రతి ఏడాది నవంబర్ 14న జరుపుకునే Children’s Day, పిల్లల అమాయకత్వం, ప్రతిభ, భవిష్యత్తును నిర్మించే వారి సామర్థ్యాన్ని గుర్తు చేసే ప్రత్యేక రోజు. 2025 Children’s Day సందర్భంగా, ఈ తరానికి తీరికలేని జీవన శైలి, ఎక్కువ గాడ్జెట్ వాడకం, తగ్గుతున్న ఫిజికల్ యాక్టివిటీ వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని, పిల్లలకు చిన్నప్పుడే నేర్పాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు ఎంతో అవసరం.

పిల్లలు చిన్నప్పుడే అలవాటు చేసుకున్న ఆరోగ్య పద్ధతులు, భవిష్యత్తులో వారి శారీరక–మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి.
1. సరిగ్గా తినే అలవాటు
పిల్లలకు చిన్నప్పుడే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పడం చాలా ముఖ్యం. రోజూ పళ్ళు & కూరగాయలు, చక్కెరపానీయాలు తగ్గించడం, జంక్ ఫుడ్ ని పరిమితం చేయడం, సరైన నీరు తాగడo, స్వచ్ఛమైన, సమతుల్య ఆహారం వారిలో ఇమ్యూనిటీ మరియు ఎనర్జీని పెంచుతుంది.
2. సరైన నిద్ర అలవాటు
సంవత్సరాల పాటు పరిశోధనలు 6–14 ఏళ్ల పిల్లలు 9–11 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి అని చెబుతున్నాయి.
• ఫోన్/టీవీని నిద్రకి 1 గంట ముందే ఆపడం
• ఫిక్స్డ్ బెడ్‌టైమ్ రొటీన్
• ఉదయాన్నే లేచే అలవాటు
ఇది పిల్లల మెదడు అభివృద్ధి, ఫోకస్, స్కూల్ పనితీరుకు చాలా మంచిది.
3. రోజూ కదలిక అవసరం
పిల్లలు బయట ఆడటం తగ్గిపోవడంతో ఊబకాయం, దృష్టి లోపం, ఒత్తిడి పెరిగిపోతున్నాయి. రోజుకు కనీసం 1 గంట వ్యాయామం లేదా బయటకి వెళ్లి ఆడుకోవడం అవసరం. రన్నింగ్, సైక్లింగ్, యోగా, డ్యాన్స్, వీటిని అలవాటు చేస్తే శరీరం & మనసు సరిగా అభివృద్ధి చెందుతాయి.
4. శుభ్రత అలవాటు
పిల్లలకు చిన్నప్పుడే శిక్షణ ఇవ్వాల్సిన అత్యంత ప్రాథమిక అలవాట్లు:
చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత, పళ్లను రోజుకు 2 సార్లు తోమడం, గోర్లు చిన్నగా ఉంచడం, పరిశుభ్రమైన బాటిల్లో నీరు తాగడం – ఈ చిన్న విషయాలు పెద్ద ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.
5. భావోద్వేగ ఆరోగ్యం
ఇప్పటి తరం పిల్లలు ఒత్తిడిని ఎక్కువ గమనిస్తున్నారు. కాబట్టి చిన్నప్పుడే నేర్పాల్సినవి: భావాలను మాటల్లో వ్యక్తపరచడం, నచ్చని వాటిని “No” అనడం, ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో బాండింగ్, చిన్న చిన్న ధ్యానం లేదా దీర్ఘ శ్వాస. ఇవి anxiety తగ్గించి, మానసిక బలాన్ని పెంచుతాయి.
6. గాడ్జెట్ వినియోగం నియంత్రణ
స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం అత్యంత ముఖ్యమైన పని. రోజుకు 1–2 గంటలకు మించి స్క్రీన్ టైమ్ వద్దు, చదువు సమయంలో ఫోన్ దూరంగా ఉంచడం, TV/Phone లేకుండా భోజనం, ఇంటర్నెట్ safety గురించి అవగాహన, డిజిటల్ అవేర్నెస్ కూడా ఇప్పుడు మస్ట్.
7. మంచి మనసు అలవాటు
చిన్నప్పుడే పిల్లలకు నేర్పాల్సిన జీవిత పాఠాలు: పంచుకోవడం, ఇతరులను గౌరవించడం, సారీ & థ్యాంక్యూ మాటల విలువ, పర్యావరణం పట్ల శ్రద్ధ, పెద్దవాళ్ళని గౌరవించడం – చదువు కన్నా ఇవే వారి భవిష్యత్తును నిర్మిస్తాయి.
Children’s Day 2025 ను కేవలం సెలబ్రేషన్ రోజుగా కాకుండా, పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు మరియు సరైన అలవాట్లపై దృష్టి పెట్టే అవకాశంగా తీసుకోవాలి. చిన్నప్పుడే నేర్పిన మంచి అలవాట్లు – మంచి వ్యక్తిత్వాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును నిర్మిస్తాయి.
