OnePlus 15R ఇండియా లాంచ్ కన్ఫర్మ్: కొత్త Oxygen OS 16 ఫీచర్లు ఏంటి?

OnePlus అభిమానులకు గుడ్ న్యూస్. కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్ OnePlus 15R ను భారతీయ మార్కెట్లో త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఈ కొత్త మోడల్ Oxygen OS 16 అనే తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

OnePlus సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక టీజర్ విడుదల చేస్తూ “OnePlus 15R – Power Meets Innovation” అంటూ లాంచ్‌ను ధృవీకరించింది. అతి త్వరలో ఇండియాలో విడుదల తేదీ వేయనున్నట్లు సమాచారం.

OnePlus 15R India Launch Confirmed

OnePlus 15Rలో ఉండబోతున్న Oxygen OS 16లో ఉన్న ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు: AI-based స్మార్ట్ పెర్ఫార్మన్స్ ఆప్టిమైజషన్, Full UI Revamp – మరింత స్మూత్ అనుభవం, బ్యాటరీ ఎఫిషెన్సీ 20% పెరుగుదల, Advanced ప్రైవసీ కంట్రోల్స్, HyperBoost Gaming Mode 2.0.

ఈ అప్‌గ్రేడ్‌లు 15R‌ను గేమర్లకు, పవర్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్‌గా మార్చనున్నాయి.

ఇప్పటికే లీక్ అయిన సమాచారం ప్రకారం OnePlus 15R : 6.74-inch AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Bezel-less Curved డిజైన్, ఇలా ఉండే అవకాశం ఉంది.

15Rలో OnePlus Qualcomm Snapdragon 8 Gen 4 లేదా అదే రేంజ్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించనుందని రూమర్స్ సూచిస్తున్నాయి. దీంతో వేగవంతమైన పనితీరు, మెరుగైన మల్టీటాస్కింగ్, అత్యుత్తమ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే OnePlus కెమెరా క్వాలిటీని మరింత పెంచే రేంజ్‌లో అప్‌గ్రేడ్ చేస్తుందని అంచనా.

మార్కెట్‌లో ఉన్న లీక్‌లు, గత మోడళ్లను చూసుకుంటే ₹34,999 – ₹39,999 మధ్య ప్రారంభ ధర ఉండే అవకాశముంది.

OnePlus 15R‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్ కనిపిస్తోంది. ముఖ్యంగా Oxygen OS 16తో రావడం వల్ల యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

OnePlus 15R ఇండియా లాంచ్ అధికారికంగా కన్ఫర్మ్ కావడంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ లెవల్ పనితీరు, Oxygen OS 16 ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అన్ని కలిపి ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉండడం ఖాయమే.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు