Balli Sastram Purushulaku: బల్లి మీద పడితే పెద్దలు రకరకాలుగా వాటి లాభ నష్టాలు చెబుతారు. బల్లి శరీరంపై ఎక్కడ పడితే ఎలాంటి ఫలితం వస్తందనేది మొత్తం గౌలి పఠన శాస్త్రంలో ఉంటుంది. తరతరాలుగా ఎన్నో ఏళ్ల నుంచి అనేక మంది ఈ గౌలి పఠన శాస్త్రాన్ని ఫాలో అవున్నారు.
బల్లి మీద పడితే పురుషులకు స్త్రీలకు వేరేవేరుగా ఫలితాలు ఉంటాయి. ఈ ఆర్టికల్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాము. బల్లి మీద పడగానే భయం ఆందోళనకు గురికాకుండా శుబ్రంగా స్నానం చేయండి. ఆ తరువాత ఈ కింద శాస్త్రాన్ని ఓ సారి చదువుకొని మీకు ఎలాంటి ఫలితం కలగబోతోందో తెలుసుకోండి.
పురుషులకు బల్లి మీద పడితే
శరీర భాగం | ఫలితం |
వీపుపై కుడి వైపు | రాజ భయం |
మణికట్టు | అలంకార ప్రాప్తి కలుగుతుంది |
మోచేయి | డబ్బు నష్టం |
వ్రేళ్ళ పై | అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక |
కుడి భుజం | కష్టాలు, సమస్యలు |
ఎడమ భుజం | పదిమందిలో అగౌరవం జరుగుతుంది |
తొడలపై | దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి |
మీసాలపై | కష్టాలు వెంటాడుతాయి |
కాలి వేళ్ళ పై | అనారోగ్య సమస్యలు |
పాదములపై | ప్రయాణానికి సిద్ధం |
తలపై భాగాన | మరణం వెంటాడుతున్నట్లు |
ముఖంఫై- | ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు |
ఎడమ కన్ను | అంతా శుభమే జరుగుతుంది |
కుడి కన్ను | చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది |
నుదురుపై | ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం |
కుడి చెంప- | బాధపడటం |
ఎడమ చెవి | ఆదాయం బాగా వస్తుంది, లాభము |
పై పెదవి | కలహాలు వెంటపడుతాయి |
కింది పెదవి | ఆదాయంలో లాభం కలుగుతుంది |
రెండు పెదవుల మధ్య | మృత్యువు సంభవిస్తుందని |
వీపుపై ఎడమ భాగం | విజయం కలుగుతుంది |
బల్లి దోషం పోవడానికి పండితులు ఒక సలహాను ఇచ్చారు. తమిళనాడులోని కంచి కామేశ్వరీ ఆలయంలోని బంగారు బల్లిని తాకి దర్శణం చేసుకుంటే ఎంతటి దోషం అయినా తొలగి పోతుందని అన్నారు. బంగారు బల్లి దర్శనం చేసుకున్న వారి పాదాలకు నమస్కరించినా దొషం తొలగుతుందని శాస్త్రా చెబుతోంది.
ఇవి కూడా చూడండి: