Annaprasana Telugu: అన్న ప్రాసన అంటే పసిపిల్లలకి మొదటి సారి అన్నం తినిపించేప్పుడు చేసే ప్రత్యేక కార్యం. పిల్లల జాతకం, తారబలం లాంటివి చూసి అన్నప్రాసన ఎప్పుడు చేయాలన్నది బ్రాహ్మణస్వామి నిర్ణయిస్తాడు. హిందూ సంప్రదాయంలో ఈ పండగని కొందరు ఘనంగా జరుపుకుంటారు. అన్న ప్రాసనరోజే ఆవకాయ అన్ని సామెత మనం ఎప్పుడూ వింటున్నదే. అన్న ప్రాసన గురించి మరిన్న విషయాలను తెలుసుకుందాం.
అన్నప్రాసన కార్యక్రమం ఆడపిల్లలకు, మగపిల్లలకు వేరుగా ఉంటుంది. మగపిల్లలకు 6,8,10, 12 ఏళ్లున్నప్పుడు చేయాలి. ఆడపిల్లలకు 5, 7, 9, 11 ఏళ్లున్నప్పుడు చేయాలి. అన్నప్రాసనని లగ్న శుద్ధి, దశమ శుద్ది వృషభ, మిధు, కటక, కన్య, ధనుస్సు, మీన రాసుల లగ్నములలో మాత్రమే చేయాలి. అన్నప్రాసనను మొదలు పెట్టే ముందు గణపతి పూజను, విష్ణుమూర్తిని, సూర్య చంద్రులను, అష్టదిక్పాలకులను, కుల దేవతను, భూదేవిని పూజించి కార్యక్రమం ప్రారంభించాలి.
అన్నప్రాసన చేసే విధానం
అన్నప్రాసన చేసే రోజు ఉదయాన్నే శిశువును లేపి స్నానం చేయించి, కొత్త బట్టలు వేయాలి. మేనమామ లేద మేనత్త తూర్పు ముఖంగా చాప లేదా పీటపై కూర్చోవాలి. మేనత్తలేదా తల్లి ఒడిలో శిశువును కూర్చోబెట్టాలి.
వెండి పాత్రలో తేనె, పెరుగు, నెయ్యిని వేయాలి. మేనత్తగానీ లేదా తల్లి గానీ బంగారు లేదా వెండి ఉంగరం సాయంతో ఆ మూడు ముద్దలను శిశువుకు తినిపించాలి. మూడు పెరుగు, తేనె, నెయ్యి ముద్దలను తినిపించాక నాల్గవ ముద్దగా అన్నాన్ని తినిపించాలి. ఆతరువాత మేనమామ, తండ్రి, తాత ఇలా అందరూ శిశువుకు అన్నాన్ని తినిపించవచ్చు.
అన్నప్రాసన రోజున దేవుడి దగ్గర పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు, డబ్బు, బంగారునగలు పెడతారు. వీటిలో శిశువు దేన్ని తీసుకుంటాడో దాన్ని బట్టి ఆ శిశువు తన జీవనోపాధిని ఎంచుకుటాడన్నది సంప్రదాయంగా వస్తుంది.
అన్న ప్రాసన చేయించేటప్పుడు ఆ సమయంలో ఎలాంటి అశుభం జరగకుండా ముందుగానే పెద్దలు బ్రాహ్మణస్వామిని కలిసి మంచి మూహూర్తాన్ని చూసి చేపించాలి. బిడ్డకు శుభముహూర్తాన అన్నప్రాసన జరిపిస్తే భవిష్యత్తులో ఆ బిడ్డకు శ్రేయస్సు, యశస్సులు కలుగుతాయి.
ఇవి కూడా చూడండి: