Gruha Vastu Sastram: గృహ వాస్తు శాస్త్రం, వాస్తు ప్రకారం గృహ నిర్మాణం, వాస్తు ప్రకారం మెట్లు, ఇంటి వాస్తు దోశాలు

Gruha Vastu Sastram: గృహ వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. కొత్త ఇంటిని వాస్తు ప్రకారం, పండితులు, వాస్తు నిపుణులు చెప్పినట్లుగా కట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరుగుతాయి. ఉన్న ఇంటికి కూడా వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అయితే గృహ వాస్తు గురించి పండితులు నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకుందాం.

గృహ-వాస్తు-శాస్త్రం

ప్రాచీన కాలంనుంచి దేవాలయాలు, గృహాలన్నీ వాస్తుపరంగానే నిర్మించారు. వాస్తు శాస్త్రంలో ప్రధానంగా నాలుగు భాగాలున్నాయి.

  1. భూమి వాస్తు
  2. హర్మ్య వాస్తు
  3. శయనాసన వాస్తు
  4. యాన వాస్తు

వాస్తు శాస్త్రంలో మొత్తం ఎనిమిది దిక్కులుంటాయి. ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరము.

ఇంటి ముందు ఈశాన్యంలో బోరుగాని లేదా బావి ఉండే విధంగా చూసుకోవాలి. ఇంటి చుట్టూ బౌండరీ వాల్ నిర్మించి ఆ తరువాత ఇంటి నిర్మాణం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంటిలోపలికి వెంటిలేషన్, సూర్యరష్మి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇంటిపైకప్పు వేసేటప్పుడు నైరుతి ఎత్తుగా నుంచి వాయువ్యము కన్న ఆగ్నేయము ఎత్తుగాను, ఈశాన్యము కన్న వాయువ్యము ఎత్తుగా ఉండేట్టు లెవెల్ సరిచేసుకొనవలెను.

గృహావరణలో గుంటలు లేకుండా, మట్టి దిబ్బెలు లేకుండా చూసుకోవాలి. ఇంటి దక్షిణ, పశ్చిమ మెయిన్ గేట్ లేదా ఎంట్రన్స్ వద్ద గడప ఎత్తు సైజులో అరుగులు నిర్మించాలి. గృహం లోపల డోర్లు, కిటీకీలు ఉచ్ఛస్థానములో ఉండేట్టు చూసుకోవాలి. ఇంటిలోపి దిమ్మెలు, పూజాపీఠాలు తూర్పు ఈశాన్యములో వేయరాదు. ప్రతిగది ఈశాన్యము నందు గృహసుడు ఖాళీగా నుంచవలెను, ఎలాంటి బరువులుంచకూడదు.

ఇంటి యజమాని తను నివసిస్తున్న గృహానికి తూర్పు, ఉత్తర ఈశాన్యంలో స్థలాలుగానీ, భవనాలుగానీ ఖరీదు చేయవద్దు. ఇంటికి దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి స్థలాలను కొనగూడదు. పడకగదిలో తలను దక్షిణంవైపు వుంచి నిద్రించాలి.

లెట్రిన్, బాత్రూములకు వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇళ్లు నిర్మించేటప్పుడు దక్షిణ భాగం గదులు పెద్దవిగా, ఉత్తర భాగం గదులు కొంచెము చిన్నవిగా, పశ్చమ భాగం గదులుకొంచెము పెద్దవిగా, తూర్పుభాగం గదులు చిన్నగా ఉండేట్లు చూసుకోవాలి.

ఇంటిలోపలి ప్రధాన ద్వారంలోని ఫ్రేములోపల ఈశాన్యం వైపు వెండి పెట్టి నిర్మిస్తే చాలా శుభం. వెండి సంపదకి, చల్లదనానికి ప్రతీక. అనుకూల శక్తులు మాత్రమే లోపలికి వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పైన ఉన్న అన్ని గృహశాస్త్ర నిబంధనలను పాటించి మీ ఇంటికి సంతోషంగా, చల్లగా, అందంగా, ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోండి.

వాస్తు ప్రకారం గృహనిర్మాణం

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాస్తు పండితుల సలహాలు తీసుకున్న తర్వాతనే వాస్తు శాస్త్ర నియామాలకు లోబడి ఇంటి నిర్మాణాన్ని చేపట్టండి.

ఇళ్లు నిర్మించే ముందు ఈశాన్య భాగంలో మొదటగా తవ్వితే ఇళ్లు నిర్మాణ కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఇళ్లు ఎక్కువ కాలం నిలవాలంటే ప్రహారీ గోడలు కూడా తప్పని సరిగా నిర్మించాలి. ఇంటిఎదురుగా మరో ఇంటికి పై కప్పు లేకుండా చూసుకోవాలి. ఇంటి స్థలానికి తూర్పు భాగంలో ఎలాంటి కట్టడం నిర్మించవద్దు. పడమర భాగంలో గోడని, పశువుల కోసం ఏదైనా నిర్మించవచ్చు.

వాస్తు ప్రకారం మెట్లు:

మెట్లను వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అలా నిర్మించుకున్నప్పుడు ఇళ్లు, ఇంట్లోని మనుషులు ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి నెగిటివ్ వైబ్స్ కూడా ఆ ఇంట్లోకి రావు. వాస్తు ప్రకారం మెట్లు నైరుతి దిశలో ఉండాలి. ఉత్తరం నుంచి ప్రారంభమై దక్షిణ దిశలో ముగించాలి.

వాస్తు ప్రకారం మెట్లు ఈశాన్యంలో నిర్మించవచ్చు. ఇలా గనుక నిర్మిస్తే ఆ ఇంటి యజమానికి మంచి జరగదు. వాస్తు ప్రకారం మెట్ల కింద ఎటువంటి నిర్మాణాల్ని చేపట్టవద్దు. మెట్ల కింద, వంట గది, అధ్యయన గది, పూజ గదిలాంటివిఉంటే ఆ ఇంటి యజమాని అనారోగ్య సమస్యలకు గురౌతాడు.

ఇంట్లో మెట్లు నిర్మించడం ప్రారంభిస్తే, వెంటనే పూర్తి చేయాలి. సగం మెట్లను మాత్రమే నిర్మిస్తే ఆ ఇంటి యజయామనికి మంచిది కాదు. ఇంటి మెట్లు మురికిగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మెట్లు మెరుస్తూ ఉంటే లక్ష్మీ దేవీ తాండవం చేస్తుంది. మెట్లపై ఎప్పుడూ లైటింగ్ ఉండే విధంగా చూసుకోవాలి.

ఇంటి వాస్తు దోశాలు:

ఇంట్లో సానుకూల ప్రతికూల శక్తులు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇంటిని వాస్తు ప్రకారం ఉంచుకోకపోతే దోశాలు కలుగుతాయి. ఇంటి పైకప్పులో ఎలాంటి చెత్త లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ చేయకుండా ఉంటే ఫ్లోరింగ్ కూడా చేయించాలి. అండర్ గ్రౌండ్ లో వాటర్ ట్యాంక్ ను ఇంకా నిర్మించకుంటే ముందు నిర్మించండి, ఎందుకంటే ఈశాన్య దిశలో నిశ్చల స్థితి నీరు ఉండటం వల్ల వాస్తు దోషం తొలగుతుంది.

కిచన్ డోర్,  బాత్రూం డోర్ ఎదురెదురుగా ఉండకుండా చూసుకోవాలి. లేదంటే ప్రతీకూల శక్తులు ఇంట్లోకి ఎంటర్ అవుతాయి. ఇంటి తలుపులు, కిటికీలు తెరుస్తున్నప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ శబ్దం వస్తే దోశం కలుగుతుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు