Jyothishya Sastram: జ్యోతిష్యం మానవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. హైందవ సంస్కృతిలో ఈ జ్యోతిష్యాన్ని చాలా పవిత్రంగా, వాస్తవంగా భావిస్తారు. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. జ్యోతిష్యం అనేది జ్యోస్యం నుంచి వచ్చింది. జ్యోస్యం అంటే జరగబోయేది. ఒక మనిషి పుట్టిన తేదీ, సమయం, స్థలాన్ని బట్టి అతడి లేదా ఆమె భవిష్యత్తులో జరగబోయే మంచి చెడుల గురించి వివరిస్తారు.
జీవితంలో మానవుడు అనుభవించే మంచి చెడూ గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు. మంచి కర్మ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే కర్మకు తగ్గ ఫలితం ఉంటుంది. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.
కర్మ రకాలు
కర్మలు బట్టి ఫలితాలు, భవిష్యత్తు ఆధారపడుతుంది. మూడు రకాల కర్మలుంటాయి.. దృఢ కర్మ, అదృఢ కర్మ, మిశ్ర కర్మ. దృఢ కర్మ అంటే అనుభవించక తప్పని కర్మలు, రెండవ అదఢ కర్మ రెమిడీస్ కి లొంగేది, 3వది గట్టి రెమిడీస్ కి లొంగేది. జ్యోతిష్య చక్రాన్ని బట్టి ఈ మూడింటిలో ఏదో తెలిసిపోతుంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ, అక్ష వేదాంశ, నక్షత్రాంశ, పుష్ట్యంశలు పూర్వ జన్మదోశాలను చూపుతాయి. నాడీ అంశను గుర్తించగలిగితే పూర్వ జన్మలను అదంలో చూసినట్లు చూడవచ్చు.
గ్రహాల ఆధారంగా జ్యోతిష్యం
మనము జన్మించే సమయానికి ఖగోళంలో గ్రహాలస్థితిగతులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకచక్రం అంటారు. ఈ జాతక చక్రాన్ని హోరోస్కోప్, జన్మకుండని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. వ్యక్తి జన్మించిన సమయం, ప్రదేశం ఆధారంగా జాతకచక్రం వేయబడుతుంది. జ్యోతిష్యం అనే మహాసముద్రంలో జాతకం ఒక నీటి బిందువు లాంటిది.
ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరం
జన్మనక్షత్రాల ఆధారంగా బ్రహ్మణస్వాములు శిశువుకు ఏ పేరుని, ఏ అక్షరం ప్రారంబంతో పెట్టాలో నిర్ణయిస్తారు. ప్రతీ నక్షత్రపాదానికి ఒక అక్షరం ఇవ్వడం జరుగుతుంది. ఆ అక్షరాల ఆధారంగానే పేరు పెట్టడానికి నిర్ణయం తీసుుకుంటారు.
అశ్విని – చు, చే, (చో,చౌ),లా
భరణి – లీ, లూ, లే, లో
కృత్తిక – ఆ, ఈ, ఊ, ఏ
రోహిణి – ఓ, వా, వీ, వు
మృగశిర – వే, వో, ( కా , కృ ) , కీ
ఆరుద్ర – కూ, ఘ, ( జ్ఞ , జ్ఞా ) ఛా
పునర్వసు – కే, కో, హా, హీ
పుష్యమి – హూ, హే, హో, డా
ఆశ్రేషా – డి , డూ, డే, డో
మఖ – మా, మీ, మూ, మే
పుబ్బ – మో, టా, టీ, టూ
ఉత్తర – టే, టో, ( పా, ఫ ), పి
హస్త – పూ, ( షం , క్షే ) , ణా, ఠా
చిత్త – పే, పో,( ప్ర, రా) , ( రీ , శ్రీ , బ్ర )
స్వాతి – ( రూ, హృ ), రే, ( రో, ద్రో , ద్రౌ ) త
విశాఖ – తీ, తూ, తే, తో,
అనురాధ – నా, నీ, నూ, నే
జ్యేష్ఠ – నో, యా, యీ, యూ మూల – (యె, యే ) , యో, బా, బి
పూర్వాషాఢ – బూ, ధా,( భా , భై ), డా
ఉత్తరాషాఢ – బే, భో , జా, జి
శ్రవణం – జూ, జే, జో, ఖ ధనిష్టా – గా, గీ, గూ, గే
శతభిషం – ( గో, గౌ ), సా, సీ, సు
పూర్వాభాద్ర – సే, సో, దా, ది
ఉత్తరాభాద్ర – దూ, ( శ్యం, శ, శ్యా ) , ఝా , థ
రేవతి – దే, దో, చా, చి
ఇవి కూడా చూడండి: