Agneyam Vastu Sastram: వాస్తు శాస్త్రంలో మొత్తం ఎనిమిది దిక్కులుంటాయి. వాటిలో ఈ ఆగ్నేయం ఒకటి. దీనినే ఆంగ్లంలో “సౌత్ ఈస్ట్” అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆగ్నేయాని వేరే అర్ధాలు కూడా ఉన్నాయి. పెళ్లి అయిన వెంటనే దంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. నక్షత్రం చూసిన తర్వాత వారితో ఓ పూజ చేయిస్తారు, దాన్ని కూడా ఆగ్నేయం అంటారు.
ఆగ్నేయములకు అధిపతి శుక్రుడు. ఆయన అగ్ని దేవుడు, వాహనం మేక. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలని పండితులు చెబుతారు. ఆగ్నేయదిశకు సంబంధంచిన వాస్తు శాస్త్రంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. దక్షిణ ఆగ్నేయదిక్కులో స్థలం పెరగకూడదు, దక్షిణ ఆగ్నేయదిక్కులో పెరిగితే నైరుతి వైపున స్థలం పెరుగుతుంది.
తూర్పు ఆగ్నేయంలో స్థలం పెరగకూడదు. అలా పెరిగితే దుష్ఫలితాలు సంభవిస్తాయి. ఆగ్నేయం తక్కువ ఎత్తులో ఉండే స్థలంలో గృౄహ నిర్మాణం కూడా చేయరాదని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఆగ్నేయ దిశ వాస్తుకు అనుకూలంగా లేకపోతే స్త్రీల సమస్యలు అనుభవిస్తారు. మహిళలకు అనారోగ్యాలు, టీనేజీ పిల్లలు చెడు దారి పట్టే అవకాశం ఉంది.
శుక్రుడు ఈ ఆగ్నేయానికి అధిపతి. ఆగ్నేయ దిశ లోపం ఉంటే ధనం నిలవదు, శుభం జరగదు. ఆగ్నేయ ధిశ లోపం ఉన్న ఇంట్లోకి ఆడపిల్లలను వివాహం చేసి పంపినా అనేక సమస్యలు ఎదురవుతాయి.
ఆగ్నేయం కొంత పెరిగినా, తగ్గినా సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం ఉండే విధంగా ఇంటియజమాని చూసుకోవాలి. ఆగ్నేయ దిశ వంటగదిని వెనకాలు శుభ్రాంగా ఉండేట్టు చూసుకోవాలి. చాలా మంది అక్కడ బట్టులు ఉతకడం, పాత్రలు కడుక్కోవడం చేస్తుంటారు. కాని ఇది మంచిది కాదు.
ఆగ్నేయం అంటే అగ్ని, కాబట్టి నీటికి వ్యతిరేకత ఉంటుంది. ఆగ్నేయ దిక్కున ఏరియా మొత్తం డ్రై ఉండే విధంగా చూసుకోవాలి. ఒక వేళ ఆగ్నేయంలో తప్పని పరిస్థితిలో బట్టలు ఉతకడం, పాత్రలు తోమడం వంటివి వస్తే.. పని అనంతరం శుబ్రం చేసి డ్రై ఉండే విధంగా చూసుకోవాలి.
ఇవి కూడా చూడండి:
- Vatsayana Sastram: వాత్సాయన శాస్త్రం, కామసూత్రం
- Jyothishya Sastram: జ్యోతిష్య శాస్త్రం, నక్షత్రాలు, జాతక చక్రం
- Gruha Vastu Sastram: గృహ వాస్తు శాస్త్రం
- Environment Essay In Telugu: పర్యావరణం పరిరక్షణ వ్యాసం తెలుగులో..