GST In Telugu: జీఎస్టీ, రకాలు, స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటిడ్ జీఎస్టీ

GST In Telugu: జీఎస్టీ అంటే గూడ్స్ ఆండ్ సర్వీస్ టాక్స్, ప్రభుత్వం రకరకాల పన్నులను విధుస్తుంది. అయితే వీటన్నింటికీ కలిపి ఓ కొత్త జీఎస్టీ పన్నువిధానానికి కేంద్ర ప్రభుత్వం 2017 జులై లో శ్రీకారం చుట్టంది. అప్పటి నుంచి ఈ జీఎస్టే పన్నుని వస్తువులు, సేవలపై విదుస్తూ వస్తుంది. అయితే జీఎస్టీ నుంచి పెట్రోల్, మద్యం, విద్యుత్తు ని మినహాయింది. వీటి పై రాష్ట్రప్రభుత్వం వేరేగ పన్ను విధిస్తుంది.

GST In Telugu

అయితే కేంద్రం కొన్నింటిపై జీఎస్టీతో పాటు సెజ్ ను కూడా విధిస్తారు. పొగాకు ఉత్పత్తులు, ఎయిరేటెడ్ డ్రింక్స్ లాంటి వాటిపై జీఎస్టీతో పాటు సెజ్ ను విధిస్తారు, దీంతో ఆయా వస్తువుల రేట్లు ఓ రేంజ్ లో పెరిగిపోతుంటాయి. జీఎస్టీ అమలు తరువాత చాలా రకాల ఉత్పత్తులపై పన్నులు తగ్గాయని చెబుతుంటారు.

జీఎస్టీ రకాలు

జీఎస్టీ మూడు రకాలుగా ఉంటాయి. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంకా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. ఈ 3 జీఎస్టీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్టేట్ జీఎస్టీ: ఇంట్రాస్టేట్ కు సంబంధించిన వస్తువులు, సేవలపై రాష్ట్రప్రభుత్వం ఈ జీఎస్టీని విధిస్తుంది. గతంలో ఉన్న వ్యాట్, ఎంటర్టైన్మెంట్ టాక్స్ అన్నీ ఈ ఎస్జీఎస్టీలో విలీనమయ్యాయి.

ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ: రాష్ట్రం కేంద్రం కలిపి వస్తుసేవలపై పన్నులు విధిస్తాయి. రెండు ప్రభత్వాలు వీటిని పంచుకుంటాయి. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఈ ఐజీఎస్టీ అవసరం పడుతుంది.

సీజీఎస్టీ: ఇంట్రాస్టేట్ గూడ్స్ అండ్ సర్వీసస్ పై కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీని విధిస్తుంది. అయితే ఎస్జీఎస్టీపై కేంద్రం మళ్లీ సీజీఎస్టీ విధిస్తుంది. ఈ రెండు పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పంచుకుంటాయి.

జీఎస్టీ మండలి: కేంద్ర రాష్ట్ర ఆర్థిమంత్రులు నిపుణులతో కలిసి ఈ జీఎస్టీ మండలి ఉంటుంది. ఈ మండలి, ఏ వస్తువులపై ఎంత పన్ను విధించాలి లాంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటాయి. డిమాడ్లను బట్టి ఈ మండలి జీఎస్టీ ఎంత విధించాలనే దానిపై మార్పులు చేర్పులు చేస్తుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు