దేశంలో ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సర్వీస్ BookMyShowపై రెవెన్యూ శాఖ ఒక కేసు వేసింది.
BookMyShow టికెట్లు అమ్ముతోంది కాబట్టి ట్రేడింగ్ (వ్యాపారం) చేస్తోంది అని, అందుకని అదనపు పన్ను (ట్యాక్స్) చెల్లించాల్సిందే అని రెవెన్యూ శాఖ వాదించింది.

కానీ CESTAT (Customs, Excise & Service Tax Appellate Tribunal) ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది ఏంటంటే: ఇది కేవలం టికెట్ బుక్ చేయడానికి ప్లాట్‌ఫారమ్ మాత్రమే, ఫిలిం లేదా ఈవెంట్ టికెట్ ధరలను BookMyShow నిర్ణయించదు. టికెట్ మనం బుక్ చేసినపుడు, ఆ మొత్తం నేరుగా సినిమాహాళ్లు / ఈవెంట్ ఆర్గనైజర్స్‌కి వెళ్తుంది, BookMyShow తీసుకునేది కేవలం convenience fee / service charge మాత్రమే.
అంటే BookMyShow టికెట్‌లను కొనడం లేదా అమ్మడం (trading) చేయడం కాదు. అందుకే దీనిపై Trading Business tax వర్తించదని CESTAT స్పష్టంగా చెప్పింది.
ఈ తీర్పు వల్ల BookMyShowకి లాభం చేకూరింది. అదనపు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా రిలీఫ్ వచ్చింది. అలాగే వినియోగదారులకు టికెట్ ధరపై దాచిన చార్జీలు లేవని స్పష్టం అయ్యింది.
BookMyShow కేవలం సర్వీస్ ఇచ్చే వేదిక అని క్లారిటీ వచ్చింది. ఈ సంఘటన తో డిజిటల్ టికెట్ ప్లాట్‌ఫారమ్‌లకు భవిష్యత్తులో ఇలాంటి పన్ను వివాదాలు తగ్గుతాయి.
CESTAT తీర్పు ప్రకారం, BookMyShow కేవలం టికెట్ బుకింగ్ సేవను అందించే వేదిక మాత్రమే. ఇది టికెట్ ట్రేడింగ్ వ్యాపారం చేయడం కాదు. అందువల్ల BookMyShowపై రెవెన్యూ శాఖ వేసిన పన్ను డిమాండ్‌ను తిరస్కరించారు.
