Aadhaar Card Download: ఆధార్ కార్డు లేనిదే ప్రస్తుతం ఆధారం లేని పరిస్థితి అయింది. ఆధార్ కార్డు ప్రతీ చోట అవసరం పడుతుంది. ఉద్యోగంలో, అప్లికేషన్ లో, సిమ్ కార్డ్ తీసుకోవడానికి, ఫోన్ కొనడానికి ఇలా చాలా సందర్భాల్లో మనకు ఆధార్ కార్డు అవసరం అవుతుంది. కొందరు ఈ ఆధార్ కార్డు అడుగుతారు. ఆ సమయంలో ఈ- ఆధార్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి లాంటి వివరాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.
ఆధార్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
- ఆధార్ అఫిషియల్ వెబ్ సైట్ కు వెళ్లండి లేదా లింక్ పై క్లిక్ చేయండి
- డౌన్ లోడ్ ఆధార్ పై క్లిక్ చేయండి
- ఆధార్ ఎంపికను క్లిక్ చేయండి
- మీ 12 ఆధార్ డిజిట్ ను ఎంటర్ చేయండి
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది
- ఓటీపీని ఎంటర్ చేసి సెండ్ చేయండి
- మీ ఆధార్ ఓపెన్ అయి ఉంటుంది. వెంటనే మీ ఈ-ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోండి
ఆధార్ కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగిన ఫోన్ మీ దగ్గర ఉండాలి. పై ప్రాసస్ లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేేస్తేనే మీ ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది లేదంటే కాదు. మరిన్ని వివరాల కోసం ఈ ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వండి
ఇవి కూడా చూడండి