Aadhar Card Update Correction: ఆధార్ కార్డుని ఎలా అప్డేట్ చేసుకోవాలి?

Aadhar Card Update Correction: ఆధార్ కార్డులో మన పేరు స్పెలింగ్ లో ఏదైనా మర్పు చేయాలనుకుంటాం. కొందరు మహిళలు తమ వివాహం తరువాత ఇంటి పేరుని అప్డేట్ చేసుకోవాలనుకుంటారు. ఇళ్లు మారినప్పుడు అడ్రస్ వివరాలను కూడా ఆధార్ లో అప్డేట్ చేయాలనుకుంటాం. ఇలా ఆధార్ అప్డేట్ గురించి ఎన్నో ప్రశ్నలు సమస్యలు మనల్ని వెంటాడుతాయి. ఈ ఆర్టికల్ లో మీకు ఆధార్ ను ఎలా అప్డేట్ చేసుకోవాలనేదానికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తున్నాము.

aadhar-card-aadhaar-card-update-correction-online

ఆధార్ కార్డుని ఎలా అప్డేట్ చేయాలి? ఏయే వివరాలను అప్డేట్ చేయవచ్చు?

ఆధార్ కార్డులో మీరు ఈ కింది వివరాలను మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు

  • జనాభా సమాచారం
  • చిరునామా
  • పేరు
  • జెండర్
  • వయస్సు / పుట్టిన తేదీ
  • మొబైల్ సంఖ్య
  • ఇమెయిల్ చిరునామా
  • సమాచార భాగస్వామ్యం సమ్మతి
  • బయోమెట్రిక్ సమాచారం
  • ముఖ ఛాయాచిత్రం
  • ఐరిస్
  • వేలి ముద్రలు

2 పధ్దతుల ద్వారా మీరు మీ ఆధార్ ను అప్టేడ్ చేసుకోవచ్చు. 1. ఆధార్ తో లింక్ అయిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను కలికి ఉండి.. ఆధార్ పోర్టల్ లో లాగిన్ అయినప్పుడు మీ మొబైల్ కు ఓటీపీ నంబర్ వస్తుంది. ఈ నంబర్ ద్వరా లాగిన్ అయి మీ వివరాలను ఎంటర్ చేయవచ్చు. 2. నేరుగా ఆధార్ ను అప్డేట్ చేసే కేంద్రాలు మీ చుట్టుపక్కలే ఉంటాయి. ఆయా కేంద్రాల్లోనే మీ ఆధార్ ను అప్డేట్ చేసుకోవచ్చు.

ఓటీపీ ద్వరా మీరే ఈ కింది విధంగా అప్డేట్ చేస్కోండి

  • ఆధార్ సెల్ఫ్ సర్వీస్ వెబ్ సైట్ ను విజిట్ అవ్వాలి
  • అప్డేట్ ఫారంను పూర్తిగా నింపాలి
  • అప్డేట్ లో మీరు సరైన డేటాను ఎంటర్ చేయాలి
  • అప్డేట్ ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత URN జెనరేట్ అవుతుంది
  • అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అపలోడ్ చేయాలి
  • URN నంబర్ ద్వారా మీ ఆధార్ అప్డేట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి

ఆధార్ అప్డేట్ ను నేరుగా PEC కేంద్రాల వద్దే చేసుకోండి

  • PEC కేంద్రానికి వెళ్లిన తర్వాత మీ ఆధార్ కార్డుపై మరోసారి బయోమెట్రిక్ ద్వారా చెక్ చేస్తారు
  • అక్కడ ఉన్న అపడేట్ ఫారంను పూర్తిగా సరైన డీటెయిల్స్ తో ఫిల్ చేయాలి
  • అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను వారికి అందించాలి
  • మీ ఆధార్ లో చేయాల్సి అప్డేట్ లను ఫారమ్ లో ఎంట్రీ చేసిన తరువాత మరోసారి కేంద్రంలోని వారికి తెలియజేయాలి
  • మీకు ఓ URN నంబర్ ను ఇస్తారు.. ఈ నంబర్ ద్వారా మీ ఆధార్ అప్డేట్ ను చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు