Bathukamma Names In Telugu: తొమ్మిది రకాల బతుకమ్మలు, వాటి పేర్లు

Bathukamma Names In Telugu: బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా ప్రాముఖ్యం కలిగిన పండగ, ఈ పండగ 9 రోజులపాటు కొనసాగుతుంది. రకరకాల పూలని అలంకరించి వాటిచుట్టూ ఆడపడుచులు, స్త్రీలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడతారు.

Bathukamma Names In Telugu

బతుకమ్మ పండగ తెలంగాణలో ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్యరోజు నుంచి ప్రారంభమయి, 9 రోజులవరకు ఈ పండగ కొనసాగుతుంది. అమ్మవారికి 9 రూపాలు ఉన్నట్లుగా బతుకమ్మకి కూడా 9 రూపాలుటాయి. స్త్రీలు ప్రతీ రోజూ ఒక్కోరూపంతో బతుకమ్మని కొలుస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ: ఇది మదటి రోజు అంటే మహాలయ అమావాస్య రోజున జరిగే పండగ. తెలంగాణలో ఈ పండగని పెత్రామస అని కూడా అంటారు. నవ్వలు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.

అటుకుల బతుకమ్మఫ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు.

అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

అలిగిన బతుకమ్మ: అశ్వయుజ పంచమి. ఈనాడు నైవేద్యం సమర్పించరు

వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా పెడతారు

వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు

సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.

బతుకమ్మ పండగరోజు “మలీద” లడ్డుకు ప్రాముఖ్యత ఉన్నది. బతుకమ్మ నిమజ్జనం అయిన తరువాత స్త్రీలు దీనిని నైవేద్యంగా అందరికీ పంచిపెడతారు. ఈ మలిదను తయారు చేసే విధానాన్ని తెలుకుందాం.

మలిద లడ్డు-కావాల్సిన పదార్థాలు

గొధుమ పిండి – 1కప్పు
బెల్లం – 1/2 కప్పు
జీడి పప్పు, కిస్మిస్, ఏలకుల పొడి
పాలు – 1టేబుల్ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నీరు తగినంత

తయారీ విధానం

పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఆ తరువాత చపాతీలుగా చేసుకొని, చిన్న సైజులో కట్ చేసుకొని బాణలిలో వేసి సన్న మంట మీద ఉంచాలి. దాంట్లో బెల్లం, జీడి పప్పు, కిస్మిస్, ఏలకుల పొడి అన్ని వేసి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పాలు కలుపుకొని లడ్డూలుగా తయారుచేసుకోవాలి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు