Vatsayana Sastram: వాత్సాయన శాస్త్రం, కామసూత్రం

Vatsayana Sastram: వేదాలలో అన్నీ ఉన్నాయంటారు. శృంగారం, సంభోగం గురించి కూడా శాస్త్రాలలో ఉంది. వాత్సాయనుడు అనే మహారుషి కామసూత్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో శృంగారం, సంభోగం గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డా, మొత్తంగా శృంగార శాస్త్రంగా దీనిని పిలుస్తారు.

వాత్స్యాయన-శాస్త్రం ఈ శృంగార శాస్త్రాన్ని భారతదేశములో మల్లనాగ వాత్సానుడు దీనికి రచించాడని చెబుతారు. క్రీస్తు పూర్వం 400-200 సంవత్సరముల మధ్యలో కామసూత్రాన్ని రచించి ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

కామసూత్ర పుస్తకంలో మొత్తం 1250 పద్యాలతో 36 విభాగాల్లో శృంగార, సంభోగ జ్ఞానాన్ని వివరించారు. 7 భాగాలుగా కామసూత్ర గ్రంధాన్ని విభజించాడు. 1. దత్తకుడు, సువర్ణనభుడు, ఘోతకముఖుడు, గోనర్దియుడు, గొనికపుత్రుడు, చారాయణుడు, ఇంకా కుచుమారుడు.

మొత్తం ఏడు భాగాల్లో శృంగారం, సంభోగం గురించి వాత్సాయనుడు వేరువేరుగా చర్చించాడు. మొదటి భాగంలో కామసూత్రకు సంబంఢించిన శాస్త్ర విషయాలు, దర్మార్ధ కామములను పొందడానికి అవలంబించే పద్ధతుల గురించి వివరించాడు.

2వ భాగంలో శృంగారానికి ముందు జరిపే పనుల గురించి వివరిచారు. ముద్దులు, కౌగిలింతలు, రతి, గతి, ఆరంభం లాంటి విషయాల గురించి ఇందులో విస్త్రుతంగా చెప్పాడు.

3వ భాగంలో వివాహా సమయంలో తీసుకునే జాగ్రత్తలు. భార్యను ఎలా ఆకర్శించాలనే లాంటి పద్ధతులను వివరించాడు.

4వ భాగంలో ఏక పత్నీ అయితే ఎలా నడుచుకోవాలి. భర్తకు ఇద్దరు భార్యలుంటే ఎలా మెలగాలి లాంటి విషయాలను ఇందులో చర్చించాడు.

5వ భాగంలో రతి సమయంలో స్రీలకు కలిగే అపోహలు, భయాలులకు సంబంధించినవి. స్త్రీ స్వభావాన్ని పరీక్షించడం లాంటి వాటి గురించి ఇందులో చర్చించాడు.

6వ భాగంలో ఇందులో మొత్తం ఆరు చాప్టర్లు ఉన్నాయి. వేశ్యలతో శృంగారం జరిపి అంశాల గురించి ఇందులో వివరంగా చర్చించాడు.

7వ భాగంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కామ కోరిక తీరకపోతే ఎలాంటి ఔషధాలు వాడాలో వాత్సాయనుడు ఇందులో వివరించాడు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు