Kiran Bedi Biography: భారతదేశ మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్

Kiran Bedi Biography: భారతదేశంలో కిరణ్ బేడి యుక్త వయసులోనే ఓ సరికొత్త చరిత్ర సృష్టించారు. 1972లో ఐపీఎస్ కు సెలెక్ట్ అయిన మొదటి భారత మహిళగా ఆమె రికార్డు సాధించారు. ఫిబ్రవరీ 2021 వరకు పుదుచ్చేరి గవర్నర్ గా కొనసాగి ప్రస్తుతం బీజేపీ లో కీలక నేతగా పనిచేస్తున్నారు. తన జీవితంలో ఎన్ని సేవలందించిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

first-woman-ips-officer-of-india-kiran-bedi

కిరణ్ బేడి, బాల్యం, విద్య

కిరణ్ బేడి 1949, జూన్ 9న పంజాబ్ లోని అమృత్సర్ లో జన్మించారు. నలుగురు కూతుర్లలో ఆమె రెండవ కూతురు. 1968లో ఆంగ్ల భాషలో డిగ్రీపూర్తి చేసింది. 1970లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎమ్.ఏ, 1988లో లా డిగ్రీ, 1993లో సోషల్ సైన్స్ విభాగంలో పీహెచ్డీనిపూర్తి కంప్లీట్ చేసింది.

1972లో దేశంలో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఎక్జామ్స్ రాసి ఐపీఎస్ గా సెలెక్ట్ అయింది. ఆ తరువాత అనేక కీలక బాధ్యతలు చేపట్టింది. నార్కోటిక్స్ ఆఫీసర్ గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్ట్ గా, అడ్మినిస్ట్రేటర్ గా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వహించింది.

1994లో కిరణ్ బేడీ జైళ్ల శాఖలకు ఐజీగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఖైదీలకు యోగా, మెడిటేషన్ నేర్పించి ఎందరిలోనే మార్పు తీసుకువచ్చింది. తిహార్ జైళ్లో ఉన్న రూపురేఖలను మార్చి వేసింది. అక్కడ ఖైదీలపై అసమానత రీతిలో ప్రవర్తించే తీరుపై ఆమె మండిపడింది.

2003లో ఐక్యరాజ్యసమితి కిరణ్ బేడీని సివిలియన్ పోలీస్ అడ్వైజర్ గా నియమించింది. రెండు ఎన్జీవోలు, నవజ్యో, ఇండియా విజన్ ఫౌండేషన్ లాంటివి స్థాపించి సేవలు అందించింది. భారతదేశంలతో పాటు అనేక దేశాలనుంచి ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించింది. కిరన్ బేడీ ప్రఖ్యాత అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ కూడా. ఆమె గతంలో ఏషియన్ ఛాంపియన్ షిప్స్ లో పాల్గొనింది.

2016లో కిరణ్ బేడి పుదుచ్చెర్రీ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్ఫనెంట్ గవర్నర్ గా నియమితులైంది ఆ తరువాడ ఆమె ఫిబ్రవరీ 2021నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది.  ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలను స్వీకరించారు.

కిరన్ బేడికి 1972లో బ్రిజ్ బేడీతో వివాహం అయింది. వారికి సుక్రుతి అనే కూతురు కూడా ఉంది. సుక్రుతి పేరును అనంతరం సానియా మార్చారు బేడీ దంపతులు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు