Home News How To Check Karuvu Pani Amount: కరువు పని అమౌంట్ ను ఎలా చెక్ చేసుకోవాలి?

How To Check Karuvu Pani Amount: కరువు పని అమౌంట్ ను ఎలా చెక్ చేసుకోవాలి?

2
How To Check Karuvu Pani Amount: కరువు పని అమౌంట్ ను ఎలా చెక్ చేసుకోవాలి?

Karuvu Pani Amount Checking: కరువు పనిని ఉపాధిహామీ పధకం కింద యూపీఏ ప్రభుత్వం 2005లో MGNREGS 2005 యాక్ట్ తో అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పధకం ముఖ్యంగా పేదలకి పనికల్పించే భరోసాను ఇస్తుంది. ఈ ఉపాధిహామీ పధకాన్ని కరువు ఉపాధి హామీ పధకం అని కూడా అంటారు.

karuvu pani amount checking ts

ఈ పధకం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి సంవత్సరానికి 100 రోజుల పని గ్యారంటీ కల్పిస్తుంది. పని డబ్బులను నేరుగా దరఖాస్తు దారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పధకాన్ని ఇప్పుడున్న 32 జిల్లాల్లో 438 మండలాల్లో, 12751 గ్రామపంచాయితీల్లో అమలు పరుస్తోంది.

కరువు పని అమౌంట్ ను తెలంగాణ రాష్ట్రంలో ఎలా చెక్ చేసుకోవాలి?

  • పధకం లబ్ది పొందాల్సిన వ్యక్తి ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి  https://nrega.nic.in/Nregahome/MGNREGA_new/Nrega_home.aspx
  • హోమ్ పేజీలోకి వెళ్లి Job Carsds లింక్ పైన క్లిక్ చేయాలి
  • Job Carsds లోకి వెళ్లిన తరువాత మీ స్వంత రాష్ట్రం, తెలంగాణని సెలెక్ట్ చేసుకోవాలి
  • తెలంగాణ రాష్ట్రం పేజీ ఓపెన్ అయిన తరువాత, అందులో సంవత్సరం, జిల్లా, బ్లాక్, పంచాయితీ వివరాలను ఎంటర్ చేసి ప్రొసీడ్ కావాలి
  • మీరు ఎంటర్ చేసిన పంచాయితీలో ఉన్న లబ్దిదారులందరి పేర్లు వస్తాయి. అందులో మీ పేరును Job Carsd నంబర్ తో సులభంగా సర్చ్ చేసుకోండి
  • మీ జాబ్ కార్డ్ నంబర్ పై క్లిక్ చేయగానే మీ జాబ్ కార్డ్, పని చేసిన కాలం, ఏ పని చేశారురనే దానికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. అక్కడే ఓ రెడ్ లింక్ ఉంటుంది. దాని పై క్లిక్ చేయగానే పని తేది, పని చేసిన స్థలం, రోజులు, అమౌంట్ కు సంబంధిచిన పూర్తి వివరాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది.  https://nrega.nic.in/nregahome/

ఉపాధి హామీ పధకం మెయిన్ వెబ్ సైట్ వివరాలు

దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ పధకం అమలవుతోంది. అన్ని రాష్ట్రాలకి సంబంధించిన అందరి కరువు పని వివరాలు కింద ఇచ్చిన ఈ వెబ్ సైట్ లో ఉంటాయి. ఈ సైట్ లోకి వెళ్లి, పైన చెప్పిన విధంగా ఫాలో అయి మీ కరువు పనికి సంబంధించిన పేమెంట్ వివరాలను తెలుసుకోండి.

కరువుపని వెబ్ సైట్ లింక్: https://nrega.nic.in/nregahome/

ఇవి కూడా చూడండి

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here