దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను హోం మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ఈ ఏడాది 128 మందికి అవార్డులు లభించాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి తన అధికారిక నివాసం – రాష్ట్రపతి భవన్‌లో ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే వేడుకల్లో ప్రదానం చేస్తారు.
గత నెలలో ఛాపర్ ప్రమాదంలో మరణించిన భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు మరణానంతరం దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ప్రకటించడం జరిగింది.
Read: Padma Awards: పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారు వీరే
వ్యాక్సిన్ తయారీదారులు – సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా మరియు భారత్ బయోటెక్‌కి చెందిన కృష్ణ ఎల్లా మరియు సుచిత్రా ఎల్లా – పద్మభూషణ్ ప్రకటించింది ప్రభుత్వం.
మరోవైపు టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ అధినేతలు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లకు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి.
సింగర్ సోనూ నిగమ్ మరియు ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా పద్మశ్రీతో సత్కరించనున్నారు.