భారత్ దేశపు అత్యున్నత పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది… 128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.. ఆ జాబితాలో నలుగురికి పద్మవిభూషన్ అవార్డులు, 17 మందికి పద్మభూషన్ అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
అయితే, ఈ ఏడాది పద్మ అవార్డులు వరించినవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు. మొత్తంగా ఏడుగురు తెలుగువారు పద్మ అవార్డులు దక్కించుకున్నారు అందులో నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా మరో ముగ్గురు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు.
తెలంగాణ నుంచి నలుగురికి, ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు దక్కాయి. కొవిడ్ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్ పురస్కారం వరించింది. పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి గోసవీడు షేక్ హసన్ (కళారంగం); డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం); గరికపాటి నరసింహారావు ఉండగా.. తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.