అనుకోకుండా ఐపీఎల్ తొలి రోజు వేలంలో అపసృతి చోటు చేసుకుంది. అంతర్జాతీయ ప్రసిద్ధ ఆక్షనీర్ హ్యూ ఎడ్మెడ్స్ వేలం మధ్యలో కుప్పకూలాడు. దాంతో వేలం నిలిచిపోయింది. శ్రీలంక ఆల్రౌండర్ హసరంగను వేలం పాడుతుండగా ఉన్నట్లుండి హ్యూ ఎడ్మెడ్ కుప్పకూలాడు. వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తున్నారు.
హసరంగను ఆర్సీబీ 10.75 కోట్ల దగ్గర పాడుతుంది. హ్యూ ఎడ్మీడెస్ వేలం నిర్వాహకుడిగా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ ఆరంభం అయిన నాటి నుంచి రిచర్డ్ మాడ్లీ వేలం నిర్వాహకుడిగా ఉండగా అతడి నుంచి 2018లో ఎడ్మీడ్స్ ఈ బాధ్యతలు తీసుకున్నాడు.
మాడ్లే స్థానంలో ఐపీఎల్ వేలం బాధ్యతలు నిర్వర్తిస్తున్న హ్యూగోకు పురాతన వస్తువుల వేలం నిర్వహణలో మాత్రమే అనుభవం ఉంది. కళాఖండాలు, వింటేజ్ కార్ల వేలం నిర్వహించే వ్యక్తి. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని సమాచారం. ప్రస్తుతానికి మెగావేలం ఆగిపోయింది. తిరిగి 3.30 గంటలకు ప్రారంభం అయ్యే ఛాన్సుంది.