Happy Holi 2022 Wishes, Quotes, Messages, Status, Images: హోలీ పండగకు హిందు మతంలో భారత దేశంలో చాలా ప్రముఖమైన స్థానం ఉంది. హోలీ రోజు మొత్తం రంగుల మయంగా ఉంటుంది. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా ఈ పండగను జరుపుకుంటారు. నేపాల్, సురినేమ్, గుయానా, త్రినిడాడ్, టొబాగొ, జమైకా లాంటి ఇతర దేశాల్లో కూడా హోలీ పండగను జరుపుకుంటారు. పురాణాల్లో చెడుపై మంచికి విజయంగా హోలీ పండగ జరుపుకుంటున్నట్లు ఉంది. హోలికా అనే రాక్షసిని కాల్చి ఈ పండగను తరువాత రోజు జరుపుకుంటారు.
పురాణాలను బట్ట విష్ణువు నరసింహఅవతారంలో వచ్చి హిరణ్యకషపుడిని హతమార్చడం వల్ల అప్పటి నుంచి ఈ పండగ వచ్చిందని తెలుస్తోంది. రాధా కృిష్ణుల అమితమైన ప్రేమకు సూచికగా కూడా ఈ హోలీ పండగను జరుపుకుంటారని తెలుస్తోంది. కులాలకు, మతాలకు అతీతంగా ఈ హోలీ పండగను ఘనంగా భారతదేశంలో జరుపుకుంటారు. ఈ హోలీ పండగ రోజు మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు హోలీ విషస్ చెప్పడానికి మేము మీ కోసం ఇక్కడ కొన్ని సెలెక్టెడ్ విషస్, కోట్స్ మీ కోసం అందించాము. మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.
హోలీ పండగ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy Holi Wishes, Quotes, Messages, Status, Images)
హోలీ పండగ రోజు శత్రువులను కూడా మిత్రులను చేసుకోవాలంటారు పెద్దలు. ఈ హోలీ పండగ రోజు మీరు మీ శత్రువలకు రంగులు పూసి మిత్రులను, శ్రేయోభిలాషులకుగా మార్చుకొండి. ఈ కింది విషస్ లో మీకు బెస్ట్ అనిపించే విషస్ ను సెలెక్ట్ చేసుకొని షేర్ చేసి, హోలీని ఘనంగా జరుపుకోండి.
వసంత గమనంలో వస్తుంది రంగుల హోలీ..
నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ…
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..
సప్త వర్ణాల శోభితమైన పండుగ.. సలక్షణమైన పండుగ.. వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక.. రంగుల కేళీ.. హళీ పండుగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
హరివిల్లులోని రంగులన్నీ.. మురళీ నాదములోని మధువు కలిసి వచ్చి ఒక చోట చేరి హోలీ నాడు రంజింపచేయాలని కోరుతూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
చెడుపై మంచి విజయం సాధించన సందర్భంగా జరుపుకునే పండుగ హోలీ.. సుఖం.. దు:ఖం.. సంతోషం, విచారం అన్ని కలిసిన రంగులే ఈ హోలీ.. రాగద్వేషాలకు అతీీతంగా అందరినీ ఒక్కచోటకు చేర్చే పండుగే ఈ హోలీ.. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు హోలీ శుభాకాంక్షలు.
అన్ని రంగులు కలిస్తేనే.. అన్ని రంగులు కలిస్తేనే ఈ నేచర్ కు అందం.. అన్ని మతాలు కలిసి ఉంటేనే ఈ దేశానికి ఆనందం.. మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..
రంగుల పండుగ వచ్చింది.. అందరిలో ఆనందాన్ని తెచ్చి పెట్టింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
రంగుల పండుగ వచ్చింది..
అందరింలో ఆనందాన్ని తెచ్చింది.
– హ్యాపీ హోలీ.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ.
– అందరికీ హోలీ శుభాకాంక్షలు.
సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకే ఈ రంగుల పండగ.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు
హోలీ రంగుల కేళీ..
మీ జీవితంలో నిండాలి రంగోలీ..
ఆరోగ్యం.. ఐశ్వర్యాలతో వర్థిల్లాలి!
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
ఆ నింగిలోని హరివిల్లు మీ ఇంట విరియాలి
ఆ ఆనందపు రంగులు మీ జీవితంలో నిండాలి
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
హోలీ రోజున ఒకరికొకరు చల్లుకొనేవి రంగులు కావు..
అనురాగ, అప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులు.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
మీ జీవితాన్ని రంగులమయం చేసుకోవడం.. మీ చేతుల్లోనే ఉంది.. హోలీ శుభాకాంక్షలు.
హ్యాపీ హోలీ మెసెజెస్ (Happy Holi Messages)
సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ గతంలో లాగే మనము ఒకరికొకరము దూరంగానే ఉన్నాము. హోలీ పండగ రోజు మీ శ్రేయోభిలాషులకు, మిత్రులకు హోలీ శుభాకాంక్షలను మెసేజిల రూపంలో చెప్పవచ్చు. ఈ కింది వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని హోలీ హ్యాపీ మెసెజ్ చేయండి.
అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం.. అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం… హోలీ శుభాకాంక్షలు..
హోలీ లాగే మీ జీవితం రంగులయం కావాలను మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు హోలీ పండగ శుభాకాంక్షలు
ఈ పండగ రోజు మీకు ఉన్న బాధలన్నీ మర్చిపోయి సుఖంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు హోలీ పండగ శుభాకాంక్షలు
ఈ హోలీ పండగ నుంచి మీ ఈ కొత్త సంవత్సరం ఆనందంగా గడవాలను మీకు హోలీ పండగ శుభాకాంక్షలు
శత్రువలను మిత్రులుగా మీర్చే పండగ హోలీ. మీ శత్రువులను హోలీ రంగులు పూసి మీకు స్నేహితులుగా మార్చుకొని హోలీ పండగను మరింత ఆనందంగా జరుపుకోండి.
హోలీకి దహనంలో మీ బలహినలల్ని, మీ బాధలను కూడా దహనం చేసి హోలీ పండగతో కొత్త ఆనందమయ జీవితానికి స్వాగతం పలకండి.
హోలీ పండగ కేవలం ఆనందంగా జరుపుకోవడానికి మాత్రమే కాదు, మన జీవితంలో ప్రేమను, రంగులను, మంచి ఆరోగ్యాన్ని నింపేందుకు జరుపుకునే ఉత్సవం.
ఈ సంవత్సం హోలీ పండగలాగే మొత్తం రంగులమయంగా సుఖసంతోషాలతో గడవాలని మీకు హోలీ పండగ శుభాకాంక్షలు
హ్యాపీ హోలీ కోట్స్ (Happy Holi Quotes)
మీ విజయంలో ఆ దేవుడు తోడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు హ్యాపీ హోలీ శుభాకాంక్షలు
ఈ సంవత్సరం మొత్తం 365రోజులు మీ జీవితం సుఖమయంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మీకు హ్యపీ హోలీ
హోలీని ఉత్సాహంగా జరుపుకోండి కాని కెమికల్ రంగులు కాకుండా సహజసిద్ధమైన, హాని కలిగించని రంగులను మాత్రమే వాడండి.
హలీ పండగ రోజు రంగులు, భంగ్ ఈ రెండు లేకపోతే హోలీ పండగ సంపూర్ణం కాదు. వీటితో హోలీ పండగను మరింత ఉత్సాహంగా జరుపుకోండి
ఈ హోలీ పండగ రోజు దేవుడు మీ జీవితంలో రంగులతో పాటు, సుఖసంతోషాలను, మంచి ఆరోగ్యాన్ని, శాంతిని కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు హోలీ పండగ శుభాకాంక్షలు.
నువ్వు ఎంత దూరంలో ఉన్నా.. నువ్వు నా మనసుకు దగ్గరగానే ఉంటావు.. హాపీ హోలీ శుభాకాంక్షలు
ఈ హోలీపండగ రోజు మీ మెదళ్లలో హోలికా, హిరణ్యకశపుడు లాంటి రాక్షసులను దహించివేసి సంతోషంగా మీరు హోలీపండగను జరుపుకోండి.
మన మధ్య దూరాన్ని, గడవలను మర్చిపోయి మనము సుఖసంతోషాలతో హోలీ పండుగను జరుపుకుందాం
అన్ని పండగల్లో హోలీ చాలా రంగులమయమైన పండగ, మీరు సుఖసంతోషాలతో ఈ హోలీ పండగను ఘనంగా జరుపుకోండి.
హ్యాపీ హోలీ ఇమేజస్ (Happy Holi Images)
ఈ బిజీ టైమ్ లో మన శ్రేయోభిలాషులను హోలీ పండగ సందర్భంగా కలవడం వీలు పడదు. ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా మాత్రమే మనము వారికి హోలీ విషస్ ను చెప్పడానికి వీలు ఉంటుంది. మెసెజిల కన్నా ఇమేజ్ వషస్ తొందరగా చేరతాయి. కింది వాటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని హోలీ విషస్ ను చెప్పండి.
హ్యాపీ హోలీ స్టేటస్ (Happy Holi Status)
వాట్సాప్ స్టేటస్ కు మామూలుగా చెప్పే విషస్ కు చాలా తేడా ఉంటుంది. ఇంటర్నెట్, యూట్యూబుల్లో అనేక హోలీ విషస్ స్టేటస్ లు ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ అనిపించే స్టేటస్ లను మీకు ఇక్కడ కింద అందుబాటో ఉంచాము. వీటిని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.
పైన మీకు అందించిన హోలీ విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. హోలీని రంగులమయంగా, ఆనందంగా, సహజమైన రంగులలతో సురక్షితంగా జరుపుకోండి.
ఇవి కూడా చూడండి:
- థియేటర్లు Vs OTT ప్లాట్‌ఫారమ్: సినిమా భవిష్యత్తు ఏది?
- Radhey Shyam Review: రాధే శ్యామ్ రివ్యూ
- Radhe Shyam Boxoffice Collection: రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్
- Aadavallu Meeku Johaarlu Movie Review: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ