Happy Ugadi Wishes in Telugu 2022: భారతదేశం లొ అతి ప్రాముఖ్యత ఉన్న పండుగ ఉగాది పండుగ , ఈ ఉగాది పండుగ ముఖ్యంగా భారతదేశం లో ఉన్న హిందువులు జరుపుకుంటారు . ఉగాది అనేది తెలుగు నూతన సంవత్సరంగా పరిగణిస్తారు, ఈ ఉగాది చైత్రమాసం లో వస్తుంది, అయితే ఉగాది రోజున అందరు ఉదయాన్నే లేచి కొత్త బట్టలు ధరించి కుటుంబ సంభ్యులతో ఎంతో ఆనందనగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ కాలంలో అందరూ కలిసి పండుగ జరుపుకోవడం లేదు , చాలావరకు వాట్సాప్ ద్వారానే పండుగ శుభాకాంక్షలు పంపిస్తుంటారు అయితే దానికోసం ఇంటర్నెట్ లో బెస్ట్ ఉగాది విషెస్ ఇమేజెస్ గాని ఉగాది మెసేజెస్ గాని సెర్చ్ చేస్తూ ఉంటారు.
మీరు బెస్ట్ ఉగాది విషెస్ కోసం వెతుకుతూ ఉంటె, మి పనిని మరింత సులభం చేయడానికి మేము మీకోసం బెస్ట్ ఉగాది విషెస్ ఈ క్రింద ఉంచుతున్నాం, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీ కుటుంభ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు మీ విషెస్ పంపించండి.
Happy Ugadi Wishes in Telugu 2022
వసంత కాలంలో మామిడి కాత..
వేప చెట్లలో పూసే చిరు వేప పూత..
వసంత రుతువులన్నీ దొసిట్లో నింపుకొచ్చే ఉగాది ఘనత
వేసవి వేడికి వాడిన ధరణి అధరాన దరహాస విరులు పూయు పూదోటగా నవ వసంతంగా ఉదయించేదే ఉగాది పండుగ
‘‘లేత లేత మామిడాకు తోరణాలు.. శ్రావ్యమైన సన్నాయి రాగాలు.. అందమైన ముగ్గులతో లోగిళ్లు.. ఉప్పొంగిన ఉత్తేజంతో రంగవల్లులు‘‘..
జీవితం అంటే సకల అనుభూతుల సమ్మిశ్రమం.. స్థిరలక్షణాలను అలవరచుకోవడం వివేకి లక్షణం.. అదే ఉగాది పండుగ తెలిపే సందేశం..
మామిడి పువ్వుకి మాట వచ్చింది.. కోయిల గొంతుకు కూత వచ్చింది.. వేప కొమ్మకు పూత వచ్చింది.. పసిడి బెల్లం తోడు వచ్చింది.. గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది.. వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది..
మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మీ మిత్రులకి , కుటుంభ సంభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు మీ ఉగాది శుభాకాంక్షలు తెలపండి.