Sri Rama Navami Essay in Telugu: శ్రీ రామ నవమి హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. పురాణాల పరముగా శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నములో మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. శ్రీరాముడి జన్మ దినమును శ్రీ రామ నవమిగా జరుపుకుంటారు.
శ్రీ రాముడి జననం
దశరధికి శ్రీ రాముడు అంటే ఎంతో ప్రేమ. సకల గుణాభి రాముడి దివ్యమైన జన్మ దాని వెనక ఉన్న కధ గురించి వివరముగా తెలుసుకుందాము
రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు
పదునాలుగు సంవత్సరములు వనవాసం చేసి, రావణుని సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతముగా అయోధ్యకు తిరిగి వచ్చిన సమయం కూడా శుద్ధ నవమి నాడు జరిగింది అన్ని ప్రజలు విశ్వసిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణము భద్రాచలంలో అంగరంగ వైభవముగా జరుపుతారు.
ఈ పండుగ సందర్భముగా హిందువులు తమ ఇళ్లలో చిన్న చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణం చేస్తారు. తరువాత విగ్రహాలను విధుల్లో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో మరియు తెలుగు రాష్ట్రలో తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవం చాలా ఘనముగా జరుపుతారు.
భద్రాచలంలో మరియు ఇస్కాన్ దేవాలయములో ఈ వేడుకలను ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ పండుగ గణుముగా నిర్వహిస్తారు.
ఇవి కూడా చూడండి:
- Sri Rama Navami Ashtothram in Telugu: శ్రీ రామ నవమి అష్టోత్రం తెలుగు
- Sri Rama Navami Panakam Recipe in Telugu: శ్రీరామ నవమి పానకం రెసిపీ తెలుగు లొ
- Sri Rama Navami Pooja Vidhanam in Telugu pdf: శ్రీ రామ నవమి పూజ విధానం తెలుగు లొ