Bipin Rawat: బయోగ్రఫీ, ఆర్మీ కెరీర్, కీలక బాధ్యతలు

Bipin Rawat: ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గత రెండు సంవత్సరాలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత త్రివిద దళాలకు ఆయన ఛీఫ్ గా కొనసాగుతున్నారు. 2019 వరకు ఆర్మీ, నేవి, ఏయిర్ ఫోర్స్ కు ఆ విభాగానికి సంబంధించిన ప్రత్యేక దళపతి ఉండేవారు. అయితే 2019 నుంచి ప్రధాని మోదీ ప్రభుత్వం క్యాబినెట్ కమిటీ ద్వారా ఈ మూడు విభాగాలకు కలిపి ఒక ఛీఫ్ ఢిఫెన్స్ ఆఫీసర్ ను నియమించడం మొదలు పెట్టింది. స్వాతంత్ర్యానంతరం మొదటి ఛీఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ ఆఫీసర్ గా బిపిన్ రావత్ నిలిచిపోయారు.

Bipin Rawat: బయోగ్రఫీ, ఆర్మీ కెరీర్, కీలక బాధ్యతలు

బిపిన్ రావత్ బాల్యం, విద్య

బిపిన్ రావత్ తండ్రి లక్ష్మన్ సింగ్ రావత్ కూడా మిలిటరీ లోనే పని చేసి లెఫ్టనెంట్ జనరల్ స్థాయి వరకు ఎదిగి రిటైర్ అయ్యారు. ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలో 1958 మార్చ్ 16న బిపిన్ రావత్ జన్మించారు. ఢెహ్రాడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూల్ లో పాటశాల విద్యను పుర్తి చేసి వెనువెంటనే ఎన్. డి. ఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో జాయిన  అయ్యారు. 1978 లో అక్కడే బి.ఎస్.సిలో డిగ్రీ పూర్తి చేసి 10 ఏళ్లపాటు తండ్రితో కలిసి కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లనో పాల్గొన్నారు.

ఆర్మీ కెరీర్

జమ్ము కశ్యీర్ లోని ఉరి ఏరియాలో కమాండింగ్ ఆఫీసర్ గా, కల్నల్ గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా, 1989 లో మేజర్ గా, 1998 లో లెప్టనెంట్ కల్నల్ గా, 2007లో బ్రిగేడర్ గా, 2017లో అత్యంత ఉన్నత స్థాయి అయిన జెనరల్ ర్యాంక్ వరకు బిపిన్ ఎదిగారు. 2017లోనే ఆయన 4 స్టార్ బ్యచ్ తో అత్యున్నత ఆర్మీ అదికారిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో కేంద్ర ప్రభుత్యం ఆయనను మూడు డిఫెన్స్ దళాలకు అదిపతిని చేస్తూ ఛీఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది.

ఎన్నో ఉత్తమ మెడల్స, గ్యాలంటరీ అవార్డులు, సత్కారాలు

బిపిన్ రావత్ తన 40 ఏళ్ల ఆర్మీ కెరీర్ లో ఎన్నో ఉన్నత పతకాలను సాధించారు. పరం విశిష్ట సేవ మెడల్, ఉత్తమ యుధ్ద్ సేవ మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్, యుద్ధ్ సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్, ఇలా ఎన్నో గౌరవ సత్కారాలను ఆయన అందుకున్నారు.

సరిహద్దుల్లో హద్దు మీరితే అంతే..

బిపిన్ రావత్ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సరిహద్దు విషయాల్లో ఎక్కడా రాజీ పడలేదు. అటు చైనా, పాకిస్తన్ సైనికులు ఎన్ని సార్లు రెచ్చగొడితే అన్ని సార్లు ఆయన బహిరంగంగా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ హద్దులు మీరితే తమ తుపాకులుకు పని చెప్పాల్సి వస్తుందని ఆయన అనేక సార్లు కౌంటర్ ఇచ్చారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు