Bhogi Kundala Muggulu 2023: భోగి కుండల ముగ్గులు
భోగి సమయంలో సూర్యుడు దక్షిణాయానంలో రోజురోజుకి భూమికి దక్షిణం వైగా దూరమవుతాడు.. చలి పెరుగుతుంది. ఈ చలిని తట్టుకుకునేందుకు భోగిమంటలు వేస్తారు. బియ్యం పిండి, సుద్దతో ముగ్గులు వేస్తుంటారు. కొన్నిసార్లు పసుపుతో కూడా వేస్తుంటారు.
భోగి ముగ్గులు (Bhogi Muggulu 2023)
అంతేనా.. ఈ రోజున ఉదయాన్నే మహిళలు ఇంటి ముందు ఊడ్చి కల్లాపి చల్లి రంగురంగులను తీర్చిదిద్దుతారు. దీంతో సాక్షాత్తూ లక్షీ దేవి తమ ఇంట కాలు పెడుతుందని వారి నమ్మకం. ఇంతకుముందు రోజుల్లో అయితే చుక్కల ముగ్గులు, రథాల ముగ్గుల ఇలా ఎన్నో ముగ్గులు వేసే వారు.
బియ్యపు పిండితో ముగ్గు ఎందుకు వేస్తారంటే..
సాధారణంగా బియ్యం పిండితో ముగ్గు వేస్తారు. దీని వల్ల పక్షులు, చీమలకు ఆహారం పెట్టినట్లు అవుతుంది. పూజలు, ఫంక్షన్లు, శుభకార్యాల సమయంలో ముగ్గులు వేయడం చాలా మంచిది. ఇది సంస్కృతిలో ఓ భాగం. వీటిని వేయడం వల్ల లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లుగా అదృష్టం, ఆశీర్వాదం లభించినట్లుగా భావించొచ్చు.