Ugadi Wishes, Quotes, Messages, Status, Images 2024: ఒకప్పడు చిన్న పడగైనా, పెద్ద పండగైనా, కుటుంబ సభ్యలు ఎక్కడున్నా, అందరు ఒక దగ్గరే కలిసి పండగ జరుపుకునేవారు. ఇక ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో అందరు కలవడమే గగనం అయిపోయింది. వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం, విషెష్ చెప్పుకోవడం, లేదా వాట్స్ అప్ ద్వారా చెప్పుకుంటున్నారు. ఇక సంక్రాంతి, హోలీ తరువాత వస్తున్నా పండగే ఈ ఉగాది. ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం అని అందరికి తెలిసిందే.
కాలం మారిన ఈ ఉగాది పండగని మన హిందూ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే మీరు మీ కుటుంబ సభ్యులకి గాని, స్నేహితులకి గాని, శ్రేయోభిలాషులకు గాని ఉగాది విషెస్ పంపించాలి అనుకుంటే, మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. ఇంటర్నెట్ లో మీరు వెతికే పని లేకుండా, మేము మీకోసం మంచి ఉగాది విషెస్ ఈ ఆర్టికల్ లో ఉంచాము. మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేస్కుని, మీ పంపించాలి అనుకున్నవారికి పంపించండి.
ఉగాది విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ ( Ugadi Wishes, Quotes, Messages, Status, Images 2024)
- అమెరికా అయినా రష్యా అయినా, హాంకాంగ్ అయినా బ్యాంకాక్ అయినా ఉగాది పండుగని ఆనందంగా జరుపుకో, మన సంప్రదాయాన్ని నిలుపుకో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- ఈ ఉగాది మీకు శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు.
- ఉగాది అంటే అన్నీకొత్తవే, కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు .
- మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీ లక్ష్యాలను మీరు సాధించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు .
- లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లాపాపలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- జీవితం సకల అనుభూతుల మిశ్రమంస్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణంఅదే ఉగాది తెలిపే సందేశంమీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది కోట్స్ ( Ugadi WishesQuotes)
గతించిన కాలాన్ని వదిలేసి…
నూతన ఏడాదికి ఘన స్వాగతం పలకాలి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శ్రీ క్రోధి నామ సంవత్సరం మీకు మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
తీపి-చేదు కలిసినదే జీవితం
కష్టం-సుఖం తెలిసినదే జీవితం
ఈ ఉగాది మీ ఇంట ఆనందాన్ని నింపాలి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మధురమైన ఈ క్షణం నిలుస్తుంది జీవితాంతం
ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మామిడి చెట్టు పూతొచ్చింది
కోయిల గొంతుకు కూతొచ్చింది
వేప కొమ్మకు పూవు పూసింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది
ఉగాది పండుగ వచ్చేసింది
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది..
ఈ ఏడాది మీకు అన్నీ విజయాలే కలగాలని ఆశిస్తూ..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను
విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీకు ఆరోగ్యం, సంపద, ఆనందం ఇవ్వాలని కోరుకుంటూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు!
ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది మెసెజెస్ (Ugadi Wishes Messages)
తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు .
మధుర మైన ప్రతిక్షణం నిలుస్తుది జీవితం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాల్ని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2024.
మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూవు మొలిచింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2024.
కష్టాలెన్నైనా రానీయకండి సవాళ్లు ఎన్నైనా ఎదురవ్వనీయకండి కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాది మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2024.
ఉగాది ఇమేజస్ ( Ugadi Wishes Images)
ఉగాది స్టేటస్ ( Ugadi Wishes Status)
మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని కుటుంబ సభ్యులకి, మీ మిత్రులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు.